Women Investors: ఆడాళ్లూ మీకు జోహార్లు..ఇన్వెస్ట్మెంట్లో దూసుకుపోతున్న మహిళలు.. ఆ సాహసధీర వనితలు ఎవరో తెలుసా?
Women Investors: నేటి కాలంలో మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తప్పనిసరి. ప్రతి మహిళా తన కాళ్ల తాను నిలబడే స్థాయికి చేరుకుంటుంది. కుటుంబ బాధ్యతలతోపాటు ఆర్థిక బాధ్యతలను భుజాన వేసుకుంటే ఎంతో సమర్థవంతంగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా గతంలో బంగారం , ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సురక్షితమైన పెట్టుబడులను మాత్రమే మహిళలను ఇష్టపడేవారు.
ఇప్పుడు ఈక్వీటీ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టడం ద్వారా మహిళలు పెద్ద మొత్తంలో లాభాలు సాధించేందుకు ముందడుగు వేస్తున్నారు. గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళా పెట్టుబడి దారులు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది
ఇది స్త్రీల ఆర్ధిక అవగాహన పెరిగిన దానికి సంబంధించింది. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మహిళలు సంపదను పెంచుకోవచ్చు. అలాగే పెరుగుతున్న ఆదాయం ద్వారా తమ కుటుంబానికి సపోర్టుగా ఉండవచ్చు. ఈ రోజుల్లో మహిళలు తమ నిపుణతను పెంచుకుని ఆర్థిక అవగాహనతో జీవించడం వంటి లక్ష్యాలు ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్లు మహిళలకు మంచి అవకాశాలను అందిస్తుంటాయి. మహిళలు ఇ్పుడు సాధికారిత, ఆర్థికంగా ఆత్మ నిర్భరమైన జీవితం గడిపేందుకు ఉత్సాహంగా పెట్టుబడులు పెడుతున్నారు.
దేశంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యం వేగంగా పెరుగుతోంది. వారు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల (ITR) సంఖ్య పెరగడాన్ని బట్టి ఇది స్పష్టమవుతుంది. 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరంలో 1.83 కోట్ల మంది మహిళలు ఐటీఆర్ దాఖలు చేయగా, 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య 25% పెరిగి 2.29 కోట్లకు చేరుకుంది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లలో మహిళా పన్ను చెల్లింపుదారుల సంఖ్య అత్యధికంగా ఉంది.మహారాష్ట్ర: 2019-20లో 29.94 లక్షల నుండి 2023-24లో 36.83 లక్షలకు (23% పెరుగుదల). గుజరాత్: 2019-20లో 18.08 లక్షల నుండి 2023-24లో 22.50 లక్షలకు (24% పెరుగుదల). ఉత్తరప్రదేశ్: 2019-20లో 15.81 లక్షల నుండి 2023-24లో 20.43 లక్షలకు (29% పెరుగుదల).లడఖ్‌లో అత్యధిక పెరుగుదల లడఖ్ వంటి చిన్న కేంద్రపాలిత ప్రాంతంలో మహిళల పన్ను చెల్లింపుదారుల సంఖ్య తులనాత్మకంగా తక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధి రేటు అత్యధికంగా ఉంది. 2019-20లో 30 మంది మహిళలు మాత్రమే ఐటీఆర్ దాఖలు చేయగా, 2023-24లో ఈ సంఖ్య ఏడు రెట్లు పెరిగి 205కి చేరుకుంది.
దేశంలో మొత్తం ఐటీఆర్ ఫైల్ చేసేవారి సంఖ్య కూడా వేగంగా పెరిగింది. 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో రికార్డు స్థాయిలో 6.77 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. ప్రజల ఆదాయం, పన్ను భాగస్వామ్యం రెండూ పెరిగినట్లు ఇది చూపిస్తుంది.ఈ పెరుగుదల మహిళల సామాజిక, ఆర్థిక ప్రగతికి ప్రతీక. పన్ను చెల్లింపుదారులుగా పెరుగుతున్న వారి సంఖ్య ఇప్పుడు ఆర్థిక నిర్ణయాలలో మునుపటి కంటే ఎక్కువగా పాల్గొంటున్నట్లు స్పష్టం చేస్తోంది.