Snakes: ఇదేం విడ్డూరం.. పాముల్ని పెంచుకుంటున్న గ్రామస్థులు.. హనీ కలిగిస్తే అరెస్ట్ చేస్తారంట..
మన ఇళ్లలో కుక్కలను లేదా పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటూ ఉంటాం. కానీ కొందరు ఏనుగులు, గుర్రాలను కూడా పెంచుకునే వారు ఉంటారు. కానీ ఇక్కడ ఒక గ్రామంలో విచిత్రంగా పాములను పెంచుకుంటారు. దానికి కూడా ప్రత్యేక గది ఉంటుంది.
ప్రతిఒక్కరు పామును చూడగానే భయంతో వణికిపోతుంటారు. పాములు ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి అస్సలు సాహాసం చేయరు. కానీ కొన్నిసార్లు పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. అలాంటి సమయంలో పాములు భయపడిపోయి కాటు వేయడం వంటివి జరుగుతుంటాయి.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో పాములను పెంచుకుంటున్నారు. అక్కడ షెట్ఫాల్ అనేగ్రామంలో పామలు స్వేచ్చగా తిరుగుతుంటాయి. గ్రామస్థులు ఎవరు కూడా పాములకు హనీ తలపెట్టరు. ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడ పాముకాటుకు చనిపోలేదంట కూడా.
ఇంట్లో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లులు తిరుగుతున్నట్లు పాములు కూడా తిరుగుతుంటాయి. అక్కడ పొరపాటున కూడా ఎవరు పాములను హనీ తలపెట్టరు. చిన్న పిల్లలు కూడా పాములను తమ మెడలో వేసుకుని ఆడుకుంటారు. అక్కడికి ఎంతో మంది నిపుణులు కూడా వెళ్లారంట.
అక్కడి పాములను చూసి ఆశ్చర్యపోయారంట. అదే విధంగా పాములు కాటు వేయకపోవడంను చూసి ఆశ్చర్యానికి కూడా లోనయ్యారంట. పాములు తమ గ్రామంలో ఉన్నడంను అక్కడి వారు ఎంతో పవిత్రంగా భావిస్తారంట. పాములు తిరిగేందుకు ప్రత్యేకంగా ప్రతిఇంట్లో గది కూడా ఉంటుందంట. దాన్ని దేవస్థ అని పిలుస్తారంట.
అనాదీగా పాములు కాటు వేయకపోవడం వల్ల వాటి సంతానానికి కూడా అదే విధంగా అలవాటు అయిపోయిందేమోనని గ్రామస్తులు చెబుతుంటారు. ఇప్పటికి కూడా పాములు ఎందుకు కాటు వేయవంట.అక్కడ పాములకు ఎవరైన హనీ తలపెట్టితే వారిని అరెస్టు చేస్తారంట. ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.