Mahesh Babu: మహేష్ బాబు ఆస్తుల విలువ.. ఆ విషయంలో కుబేరుడే..!

Fri, 09 Aug 2024-5:20 pm,

సూపర్ స్టార్ కృష్ణ కడుకుగా సినిమా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశాడు మహేష్. చిన్నప్పుడే ఎన్నో సినిమాలు చేసిన ఈ హీరో.. రాజకుమారుడు సినిమాతో.. హీరోగా.. సినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో మంచి విజయం సాధించింది. 

మొదటి సినిమాతోనే విజయం అందుకోవటమే కాకుండా.. ప్రిన్స్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఇక ఒక్కడు సినిమాతో సూపర్ స్టార్ గా ఎదిగారు ఈ హీరో. ఆ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో.. బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. 

ఇక ఆ తరువాత వచ్చిన పోకిరి సినిమా మహేష్ బాబు రేంజ్ ని అమాంతంగా పెంచేసింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ చిత్రం.. అప్పట్లో కోట్ల కలెక్షన్ సాధించింది. మహేష్ బాబు కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. ఎంతోమంది అభిమానులను సంపాదించిపెట్టింది. అంతేకాదు ఈ సినిమా సాధించిన రికార్డులు అన్నీ.. ఇన్ని కాదు. 

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో త్వరలో.. తన 29వ సినిమా చేయనున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్.. లెవెల్ లో రానుంది. కాగా ఈరోజు మహేష్ బాబు తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.   

మహేష్ బాబు హీరోగా, నిర్మాతగా, బిజినెస్ మాన్ గా ఫుల్ గా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఈయన ఆస్తి గురించి ఒక వార్త అభిమానులను షాక్ కి గురిచేస్తుంది. అసలు విషయానికి వస్తే మహేష్ బాబు ఆస్తి విలువ సుమారుగా రూ.10వేల కోట్లకు పైగానే.. ఉంటుందని సమాచారం . దీన్ని బట్టి చూస్తే ఈయన సంపాదనలో కుబేరుడు అని చెప్పకనే చెప్పొచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link