Mahesh Babu Recent Movies Collections: `గుంటూరు కారం` సహా మహేష్ బాబు రీసెంట్ మూవీస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ డీటెల్స్..

Thu, 22 Feb 2024-11:25 am,

'గుంటూరు కారం': త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' మూవీ ఫ్లాప్ టాక్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర రూ. 111.81 కోట్ల షేర్ రాబట్టింది.

సర్కారు వారి పాట: సూపర్ స్టార్ హీరోగా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో కూ. 110.12 కోట్ల షేర్ రాబట్టింది.

 

సరిలేరు నీకెవ్వరు: అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సరిలేరు నీక్వెవరు'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 138.78 కోట్ల షేర్ రాబట్టి హిట్‌గా నిలిచింది.

మహర్షి: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మహర్షి'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 104.58 కోట్ల షేర్ రాబట్టి హిట్ అనిపించుకుంది.

భరత్ అను నేను: సూపర్ స్టార్ మహేష్‌ బాబు, కొరటాల శివ రెండోసారి కలిసి పనిచేసిన చిత్రం 'భరత్ అను నేను'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 101 కోట్ల షేర్ రాబట్టింది.

మొత్తంగా మహేష్ బాబు గత ఐదు చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్స్ కలిపి రూ. 566.29 కోట్ల షేర్ వచ్చింది. ఒక రకంగా ప్యాన్ ఇండియా సినిమాలు కాకపోయినా.. ఈ రేంజ్‌లో షేర్ వసూళ్లు చేసిన హీరోగా మహేష్ బాబు రికార్డులకు ఎక్కారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link