Malavika Mohanan: టూ పీస్ డ్రెస్‌లో మాళవిక మోహనన్ అందాల బ్లాస్ట్.. చూసి కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే సుమీ..
మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ మాళవిక మోహనన్ ఫస్ట్ మూవీ. ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది.
ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతోనైనా కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి. ఈ మూవీ తర్వాత మాళవికకు తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.