Kantara Chapter 1: రిషబ్ శెట్టి తండ్రి పాత్రలో మలయాళం సూపర్ స్టార్.. ఎవరంటే?

Tue, 01 Oct 2024-3:07 pm,

ప్రస్తుతం కన్నడ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కాంతారా చాప్టర్ 1. సినిమా హీరో రిషబ్ శెట్టి.. సినిమాకి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు ఈ సినిమా గురించిన చిన్న చిన్న అప్డేట్లు కూడా.. సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమా మీద అంచనాలను.. రోజురోజుకీ పెంచితూ వస్తోంది చిత్రం బృందం. 

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రిషబ్ శెట్టి తండ్రి పాత్రలో.. ఒక ప్రముఖ మలయాళం నటుడు కనిపించబోతున్నట్లు వార్తలు కనిపిస్తున్నాయి. ఆ మలయాళం సూపర్ స్టార్ మరెవరో కాదు మోహన్ లాల్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా బయటకు రాలేదు. 

అయితే ఈ ఏడాది ఏప్రిల్ లోనే.. రిషబ్ శెట్టి తన భార్య ప్రగతితో కలిసి.. మోహన్ లాల్ ను కలిశారు. వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కాంతారా: చాప్టర్ 1 సినిమా కదంబ యుగంలో సాగే పంచూర్లి దేవత కథాంశం ఆధారంగా రూపొందుతుంది. 

రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ మళ్లీ సంగీతాన్ని అందించనున్నారు. మొదటి భాగంలో అజనీష్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంది. భారీ అంచనాల మధ్య కాంతారా: చాప్టర్ 1 సినిమా ఈ ఏడాది చివర్లో లేదా 2025 మొదట్లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. థియేట్రికల్ ప్రదర్శన పూర్తయ్యాక సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ అనే సినిమాలో హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాతో మోహన్ లాల్ దర్శకుడిగా కూడా మారబోతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link