Snake Revenge: ఇదేక్కడి రీవెంజ్.. తోటి సర్పాన్ని చంపాడని కసితీరా కాటేసిన మరో పాము.. ఎక్కడ జరిగిందో తెలుసా..?..
సాధారణంగా పాములు పగబడుతాయని పెద్దలు చెప్తుంటారు. పాము పగ పన్నేండెళ్లు ఉంటుందని కూడా చెప్తుంటారు. అందుకే పాముల జోలికి అస్సలు పొవద్దని చెప్తుంటారు. అయితే.. ఒక వ్యక్తి పామును ఇష్టమున్నట్లు కొట్టి చంపాడు.
ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. గోవింద్ కశ్యఫ్ అనే యువకుడు పొలంలో కూలీగా పనిచేస్తున్నాడు. తన గ్రామానికి చెందిన పొలంలో.. మంగళవారం ఉదయం తన పొలంలో వరి కోయడం, గడ్డి కోస్తుండగా పాము బయటకు వచ్చింది.
ఈ సమయంలో అక్కడే ఉన్న గోవింద్ పామును చూసి కర్రతో కొట్టడం ప్రారంభించాడు. అలాగే గాయపడిన పామును తొక్కి చంపేశారు. దీంతో పాము విలవిల్లాడుతూ చనిపోయింది.
ఆ తర్వాత అతగాడు..పామును అక్కడే వదిలేసి తినేందుకు వెళ్లిపోయాడు. అప్పుడు అక్కడకు మరో పాము వచ్చినట్లు తెలుస్తొంది. అది కోపంతో.. గొవింగ్ పొలంలో పనిచేస్తుండగా.. అతని దగ్గరకు వెళ్లింది. అతని మీద కోపంతో కసితీరా కాటు వేసింది.
దీంతో అతను ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తన వాళ్లను కాపాడాలని కేకలు వేశాడు. కానీ అతను మాత్రం చూస్తుండగానే కుప్పకూలీ పడిపోయాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించే లోపు చనిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు షాక్ కు గురయ్యారు.
తోటి సర్పాన్ని చంపినందుకు పగతో మరో పాము.. గోవింద్ కశ్యప్ ను కాటేసి చంపిందని కూడా చెప్పుకుంటున్నారు. అతడ్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లేలోపు అతడు చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. గోవింద్ మృతితో ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. అలాగే గోవిందాన్ని కాటేసిన పాము కోసం గ్రామస్తులు వెతుకుతున్నారు.