Devara Dual Role: దేవరలో అదిరే పాత్రల్లో ఎన్టీఆర్‌.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈసారి

Tue, 10 Sep 2024-6:50 pm,

Jr NTR Devara Trailer: యావత్‌ సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర సినిమా ట్రైలర్‌ విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ జోడీగా దేవర తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండు పాత్రల్లో నటిస్తున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. 

Jr NTR Dual Role: టీజర్‌, ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసిన చిత్ర బృందం తాజాగా ఎన్టీఆర్‌ రెండు పాత్రల్లో కనిపిస్తున్నారనే వార్త వైరల్‌గా మారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ డ్యుయల్ రోల్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.

Jr NTR Dual Role: ఆంధ్రావాలా సినిమా తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. జై లవకుశలో త్రిపాత్రాభినయం చేశారు. కానీ రెండు పాత్రల్లో నటించడం మాత్రం ఇది రెండోసారి.

Jr NTR Dual Role: దేవరలో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్‌ కనిపించనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. యోధుడిగా ఉన్న దేవర పాత్రలో.. ఆ తర్వాత పిరికివాడు.. భయస్తుడైన దేవర కొడుకు పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్నారని ట్రైలర్‌ను బట్టి చెప్పవచ్చు.

Jr NTR Dual Role: యోధుడిగా.. శత్రువులను చండాడే ధీరుడిగా దేవరగా.. భయస్తుడైన కొడుకు పాత్రలో రెండు పార్వ్శాలు ఉన్న పాత్రల్లో ఎన్టీఆర్‌ నటిస్తుండడం విశేషం. 

Jr NTR Dual Role: దేవర సినిమాతో ఎన్టీఆర్‌ తనలోని నటనా స్థాయిని మరింత పెంచనున్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది.

Jr NTR Dual Role: ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న దేవరలో సైఫ్‌ అలీఖాన్‌, ప్రకాశ్ రాజ్‌, శ్రీకాంత్‌, షైనీ టామ్‌ చాకో, నరైన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Jr NTR Dual Role: సంద్రం ఒడ్డున నివసిస్తున్న ఓ జాతిని కాపాడే కథాంశం సినిమా కథగా తెలుస్తోంది. జాన్వీ కపూర్‌ అందం.. అనిరుధ్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా మరో మెట్టులో నిలిచేట్టు ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link