Kriti Shetty: వైట్ లెహంగాలో ఏంజెల్ లా కృతి శెట్టి.. చూస్తే ప్రేమలో పడిపోతారు

Sun, 09 Jun 2024-12:17 pm,

వైష్ణవి తేజ్ హీరోగా వచ్చిన.. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించడం అనేది.. కొంతమందికే దక్కే అదృష్టం. ఆ అదృష్టాన్ని కృతి శెట్టి.. సులువుగానే సంపాదించుకొండి. ఈమె మొదటి సినిమానే 100 కోట్లు.. సంపాదించి అందరిని ఆకట్టుకుంది.

ఆ తరువాత నాని హీరోగా వచ్చిన.. శ్యామ్ సింగరాయ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా.. కనిపించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించిపెట్టింది. ఇక వెంటనే నాగచైతన్యతో బంగార్రాజు సినిమాలో.. కనిపించి హ్యాట్రిక్ సొంతం చేసుకోండి.

కానీ ఆ తరువాత వచ్చిన కృతి సినిమాలు.. ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందువల్లనే గత కొద్దిరోజులుగా.. వరస డిజాస్టర్లతో సతమతమవుతోంది హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి తమిళ సినిమాల్లో.. ఛాన్సులు వస్తున్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి.

కాగా తెలుగులో మంచి విజయం సాధించడానికి.. ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా.. వచ్చిన మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి. జూన్ 7న విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల దగ్గర పరవాలేదు అనిపించుకుంటోంది.  

ఈ నేపథ్యంలో కృతి ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ వైట్ లెహంగాలో.. దివి నుంచి భువికి.. దిగివచ్చిన ఏంజెల్ లాగా కనిపించి అందరిని ఫిదా చేస్తోంది

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link