Manisha koirala: ఆ సమయంలో నా ఫ్రెండ్స్ పట్టించుకోలేదు.. ఎమోషనల్ అయిన మనీషా కోయిరాలా..

Sun, 12 May 2024-8:32 pm,

బాలీవుట్ నటీ మనిషా కోయిరాలా 2012 లో గర్భాశయ క్యాన్సర్ కు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ సమయంలో అనేక మార్లు కీమో థెరపీ వంటి చికిత్స కూడా చేయించుకున్నారు. దీంతో చాలా సార్లు ఎంతో ఒత్తిడికి గురయ్యానని కూడా ఆమె ఎమోషనల్ అయ్యారు.

ఇటీవల మనీషా కోయిరాలా తాను క్యాన్సర్ మహామ్మారి బారిన సమయంలో ఎదుర్కొన్న ఘటనలను  ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. క్యాన్సర్ జర్నీలో తన కుటుంబంతో మాత్రమే సపోర్ట్ చేసిందని అన్నారు. తన స్నేహితులు ఎవ్వరూ కూడా తనను పలకరించలేదని ఫీలయ్యారు.  

తన జీవితంలోని కొన్ని బాధాకరమైన రోజులను గుర్తుచేసుకున్నారు. ఎంతో సన్నిహితులునుకున్న వారంతా ఆసమయంలో పక్కకు తప్పుకున్నారన బాధపడ్డారు. స్నేహితులంటే కష్టాల్లో, సంతోషాల్లో పాలు పంచుకుని నేనున్నానని ధైర్యం చెప్పాలి. కానీ తన స్నేహితులేవ్వరు అలా చేయలేదని ఎమోషనల్ అయ్యారు.

మనీషా కొయిరాలా భారతీయ చలనచిత్రం రంగంలో ఎవర్‌గ్రీన్ నటీమణులలో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. తన టాలెంట్, నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నారు.  మనీషా కోయిరాలా.. 2012లో అండాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎదురుదెబ్బ తగిలింది.ఆమె కఠినమైన కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చింది.  

ఆ ప్రక్రియలో ఆమె జుట్టు మొత్తాన్ని కూడా కోల్పోయింది. అనేక రకాల  సైడ్ ఎఫెక్ట్ లకు గురి అయ్యింది. ఎంతో మానసిక ఒత్తిడికి గురైంది. కానీ క్రమంగా ఆమె పుంజుకుంది. ప్రస్తుతం మనీషా కోయిరాలా.. ఇటీవల, మనీషా హీరామండి: ది డైమండ్ బజార్‌లో తన నటనకు అభిమానులనుంచి ప్రశంసలు అందుకుంది.  

మనీషా కొయిరాలా క్యాన్సర్‌తో వ్యవహరించేటప్పుడు తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ, తన నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకునేలా చేసింది. మరికొంత వివరిస్తూ, ఆమె తన ఆరోగ్య భయానికి ముందు, తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని, తనతో పార్టీలు చేసుకునేవారని, ఫుల్ గా ఎంజాయ్ చేసేవాళ్లమని తెలిపింది.  

అయితే, ఎప్పుడైతే తనకు క్యాన్సర్‌తో సోకిందని తెలిసిందో అప్పటి నుంచి  వారి వైఖరిలో మార్పు వచ్చిందని మనీషా గుర్తించింది. నా స్నేహితులంతా నా నుంచి దూరంగా వెళ్లిపోయారని, ఈ ప్రయాణంలో కేవలం.. నా తల్లిదండ్రులు, ఇది నా సోదరుడు, ఇది నా సోదరుడి భార్యమాత్రమే ఉన్నారని చెప్పి మనీషా కోయిరాలా ఎమోషనల్ అయ్యారు.  

మనీషా కొయిరాలా ప్రాణాంతక క్యాన్సర్‌ను ఓడించి, న్యూయార్క్‌లో కఠినమైన చికిత్స తీసుకున్న తర్వాత క్యాన్సర్ నుండి బయటపడింది. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ కొన్ని చిన్న ప్రభావాన్ని మిగిల్చిందని చెప్పుకొచ్చింది. హీరామండి షూటింగ్‌లో తనకు తరచుగా మానసిక కల్లోలం ఎలా ఉండేదో మనీషా వ్యాఖ్యానించింది. కొన్నిసార్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేదాన్నని మనీషా తన భావాలు చెప్పుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link