Manu bhaker: మనుభాకర్ సీరియస్.. ఎల్ఐసీ, ఫిట్జీలతో పాటు పలు కంపెనీలకు లీగల్ నోటీసులు.. కారణం ఏంటంటే..?

Wed, 31 Jul 2024-1:29 pm,

మనుభాకర్ ఇప్పుడు ఈ మహిళా షూటర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారిపోయింది. ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో భారత్ ను సగర్వంగా తల ఎత్తుకునేలా చేసింది. ఇప్పటికే ఈ మహిళా అథ్లేట్ రెండు కాంస్య పతకాలు గెలుచుకుని అందరి మన్ననలను పొందుతుంది. ఎక్కడ చూసి మను భాకర్ విజయాలు, ఆమె పడిన కష్టంగురించి మాట్లాడుకుంటున్నారు.  

కేవలం 22 ఏళ్ల ప్రాయంలో హర్యానాకు చెందిన.. మనుభాకర్ తన సత్తాచాటుకుంది. అదే విధంగా 16 ఏళ్లకే ఆమె స్వర్ణపతకం కూడా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఇటీవల భారత్ తరపున ఆడి ఒలింపిక్స్ లో సత్తాచాటుకున్నాక చాలా మంది మను ఏవిధంగా కష్టపడిందని తెలుసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

ఇటీవల కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. తమ ప్రభుత్వం.. మనూ కోసం 2 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.  ఖేలో ఇండియాలో భాగంగా మనును ప్రొత్సహించినట్లు తెలిపారు. మోదీ సహాకారంతో.. మనూ ట్రైనింగ్ కోసం.. జర్మనీ, స్విట్జర్లాండ్ లకు పంపించినట్లు తెలిపారు.ఆమె కోరుకున్న ట్రైనర్ ను ఆమెకు కోచ్ గా అందించామన్నారు. దీంతో ఆమె ఎంతో కష్టపడి ప్రస్తుతం సత్తా చాటిందన్నారు.

మరోవైపు కొన్ని కంపెనీలు మను గెలిచిన తర్వాత  ఆమెను అభినందిస్తు, బోర్డింగ్ లు , యాడ్స్ , వీడియోల రూపంలో యాడ్స్ లను ఇచ్చుకుంటున్నాయి. గతంలో మనుకు ట్రైనింగ్ కోసం.. పలు సంస్థలను సహాకారం అందించాలని కోరగా.. అనేక కంపెనీలు ముఖం చాటేశాయి. కానీ ఆమె మాత్రం కేంద్రం సహాకారంతో అనుకున్నది సాధించింది. 

ఇదిలా ఉండగా.. మను భాకర్ ను స్పాన్సర్ చేయకుండా, ఆమెను గురించి అభినందన ప్రకటనలు చేస్తున్న బ్రాండ్‌లకు మనూ బాకర్ మెనెజర్ లీగల్ నోటీసు పంపారు. మను భాకర్‌ను స్పాన్సర్ చేయని వాటిల్లో.. బజాజ్ ఫుడ్స్, LIC, FIITJEE వంటి బ్రాండ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మను భాకర్ ఫోటోలు,  వీడియోలను ఉపయోగించి అభినందన ప్రకటనలు చేస్తున్నట్లు గుర్తించారు.   

వీటితో పాటు.. IOS స్పోర్ట్స్ & ఎంటర్‌టైన్‌మెంట్ కూడా నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. గతంలో తనకు స్పాన్సర్ చేయకుండా.. కేవలం గెలిచాక.. తన బ్రాండ్ ను వాడుకోవడం పట్ల  ఆమె ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  

గెలిచే వరకు మనుని కనీసం పట్టించుకొని.. దాదాపు రెండు డజన్ల బ్రాండ్‌లు, ఆమె ఫోటోలు, వీడియోలతో వాటి బ్రాండ్‌లతో సోషల్ మీడియాలో అభినందన ప్రకటనలను విడుదల చేశాయని IOS స్పోర్ట్స్ & ఎంటర్‌టైన్‌మెంట్ MD నీరవ్ తోమర్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. ఈ బ్రాండ్‌లలో కొన్ని బజాజ్ ఫుడ్స్, LIC, FIITJEE, ఓక్‌వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆప్రికాట్ బయోసైన్స్, ప్రణీత్ గ్రూప్, రాధా TMT, కినెటో, పరుల్ ఆయుర్వేద్ హాస్పిటల్ మరియు ఎక్స్‌ట్రాబ్రిక్ రియల్టర్స్ ఉన్నట్లు సమాచారం.  

కేవలం మను భాకర్ ప్రస్తుతం స్పోర్ట్స్ గేర్,  ఫిట్‌నెస్ ఫ్యాషన్ కంపెనీ,  పెర్‌ఫార్మాక్స్ యాక్టివ్‌వేర్‌ను మాత్రమే ఆమోదించారు. అయితే, దాదాపు అర డజను ఇతర బ్రాండ్‌లు ప్రస్తుతం ఆమెతో స్పాన్సర్‌షిప్‌ల కోసం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో పలు కంపెనీలకు మాత్రం ఆమె లీగర్ టీమ్ నోటీసులు పంపించడం మాత్రం వార్తలలో నిలిచింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link