Manu Bhaker: హ్యాట్రిక్ కు జెస్ట్ ఒక్క అడుగే.. 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్స్ కు దూసుకెళ్లిన మను బాకర్..
పారిస్ ఒలింపిక్స్ లో భారత్ షూటర్ సత్తాచాటుతున్నారు. ఇప్పటికే రెండు కాంస్య పతాకాలు గెల్చుకున్న ఈ స్టార్ షూటర్ ప్రస్తుతం మూడో పతకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు..
షూటింగ్ లో.. 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో టాప్ 2 లో నిలిచి ఫైనల్స్ లో అర్హత సాధించారు. ఈక్రమంలో శుక్రవారం (జులై2) న జరిగిన పోరులో.. 294 పాయింట్లు సాధించి టాప్ 3 లో నిలిచారు.
ర్యాపీడ్ సిరిస్ లో.. ఏకంగా 100 పాయింట్లు సాధించింది. ఈ రౌండ్ లో.. 296 స్కోరు సాధించింది. మొత్తంగా 590 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకెళ్లింది.ఈ క్రమంలో మనూభాకర్ మరో అద్భుత రికార్డుకు అడుగుదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. శనివారం రోజు ఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. దీని కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. శనివారం (జులై 3) న జరగబోయే.. ఫైనల్ పోరులో విజయంసాధిస్తే.. మను సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఇప్పటికే రెండు పతకాలను మనూ సాధించింది.
ఇప్పటికే 10 మీటర్లు ఎయిల్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోను, ఆ తర్వాత షూటర్ సరబ్ జోత్ సింగ్ లో 10 మీటర్లు పిస్టల్ డబుల్స్ లో కాంస్యం సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి క్రీడాకారిణిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
ప్రస్తుతం 25 మీ. పిస్టల్ విభాగంలో ఫైనల్స్ కు వెళ్లడంతో ఒకే.. ఒలింపిక్స్ లో.. ఫైనల్ కు చేరిన తొలి క్రీడాకారిణిగాకూడా రికార్డ్ సాధించారని చెప్పుకొవచ్చు.