Maruti: మారుతి నుంచి సరికొత్త సీఎన్జీ కారు..మైలేజీలోనే కాదు సేఫ్టీలనూ టాప్..లాంచ్ ఎప్పుడంటే?

Sat, 09 Nov 2024-7:38 am,

Maruti Suzuki Dzire CNG : మారుతి కంపెనీకి చెందిన కార్లకు  భారతదేశంలో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వాటిలో మారుతి స్విఫ్ట్, మారుతి వ్యాగన్ఆర్, మారుతి ఎర్టిగా, బాలెనో అలాగే మారుతి డిజైర్ కూడా ప్రముఖంగా ఉన్నాయి.  మంచి కార్లతోపాటు సేఫ్టీకి సైతం ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ కంపెనీ ముందుంటుంది. మారుతి సుజుకీ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూనే ఉంటుంది.

అంతేకాదు అందరికీ అందుబాటులో ధరలో కార్లను అందించే బ్రాండ్ గా మారుతికి మంచి పేరుంది. కొత్తగా మారుతి సుజుకి డిజైర్ గురించి మార్కెట్లో పెద్ద చర్చే నడుస్తోంది. నవంబర్ 11వ తేదీన డిజైర్ సీఎన్జీ కారును లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.   

కొత్త మారుతి సుజుకి నవంబర్ 11న భారత మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. సరికొత్త ఫీచర్లతో అప్ డేట్ చేసిన ఈ కారుపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో సీఎన్జీ వెర్షన్ ను కూడా కంపెనీ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టాటా టిగోర్, ఐసీఎన్జీ, హ్యుందాయ్ ఆరా సీఎన్జీ కార్లకు ఇది గట్టి పోటీనివ్వనుంది.   

డిజైర్ సీఎన్జీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో 68 బీహెచ్ పీ శక్తిని 101.8 ఎన్ ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేసి వస్తుంది. కొత్త డిజైర్ సీఎన్జీ కిలోకు 33.73 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. కొత్త డిజైర్ ఎల్ఎక్స్ ఐ, VXI, ZXI, ZXI ప్లస్ అనే నాలుగు వేరియంట్స్ అందుబాటులో ఉంటుంది. సీఎన్జీ వెన్షన్ మిడ్ స్పెక్స్ VXI, ZXI ట్రిమ్స్ తో వస్తుంది.   

భద్రతా పరంగా కొత్త తరం మారుతి డిజైర్ 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్  అసిస్ట్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో వస్తుంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫేటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, వెనక ఏసీ ఎంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.   

ఇక ఈ మారుతి సుజుకి డిజైర్ బుకింగ్స్ నవంబర్ 4 నుంచి షురూ అయ్యాయి. ఈ కొత్తమారుతి సుజుకీ డిజైర్ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కేవలం రూ. 11, 000టోకెన్ మొత్తాన్ని చెల్లించి డీలర దగ్గర లేదంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link