Meera Chopra Marriage: కేజ్రీవాల్‌ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. పిక్స్ వైరల్..
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' మూవీలో నటించిన మీరా చోప్రా గుర్తుంది కదా. ఈ సినిమా తర్వాత తెలుగులో 'వాన', నితిన్‌తో 'మారో' సినిమాల్లో కలిసి నటించింది. తెలుగులో పెద్దగా గుర్తింపు దక్కకపోవడంపై హిందీ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. తాజాగా పెళ్లి చేసుకొని వివాహా బంధంలో అడుగుపెట్టింది.
మీరా చోప్రా వివాహాం ఈ మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ రిసార్టులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన రక్షిత్ కేజ్రీవాల్‌తో జరిగింది. అగ్నిసాక్షిగా ఏడడుగుల బంధంతో హిందూ సంప్రదాయ పద్దతిలో వీళ్లిద్దరు ఒకటయ్యారు.
తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీరా చోప్రా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు, సన్నిహితులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గత కొన్నేళ్లుగా మీరా చోప్రా, రక్షిత్ కేజ్రీవాల్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని అప్పట్లోనే మీరా చోప్రా పలు ఇంటర్వ్యల్లో ప్రస్తావించడం గమనార్హం.
మీరా చోప్రాకు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలు కజిన్స్ అవుతారు. మీరా చోప్రా తండ్రి సురేష్ చోప్రా, ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతాడు.