Mercury In Jyeshta: జ్యేష్ట నక్షత్రంలోకి బుధుడు.. ఈ రాశులవారికి ఇక లాటరీ తగిలినట్లే.. డబ్బే, డబ్బు!
చాలా రోజుల తర్వాత బుధుడు జ్యేష్ట నక్షత్రం (Jyeshtha)లోకి ప్రవేశించబోతున్నాడు. అయితే బుధుడు ఈ నక్షత్రం లోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ఎప్పుడూ లేని ఆనందం కూడా లభిస్తుంది. ఇదిలా ఉంటే ఈ గ్రహం డిసెంబర్ 24వ తేదీన జ్యేష్ట నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. అయితే బుధ గ్రహానికి ఈ నక్షత్రం అంటే చాలా ఇష్టమని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
బుధుడు జ్యేష్ట నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయే గొప్ప అవకాశం బుధుడి అనుగ్రహిస్తాడు. దీనివల్ల జీవితంలో ఆనందం సంతోషాలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఎప్పుడు పొందలేని డబ్బును కూడా పొందుతారు.
బుధుడు జేష్ఠ నక్షత్రంలోకి సంచారం చేయడం వల్ల వృశ్చిక రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు గతంలో కోర్టు కేసుల పాలైన వారికి ఈ సమయంలో చక్కటి పరిష్కారం లభించబోతోంది. అలాగే ఆర్థిక పరమైన సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభించే అవకాశాలున్నాయి. వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది.
బుధుడు నక్షత్ర సంచారం చేయడం వల్ల కన్యా రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మేదోశక్తి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనల ఆవాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు గతంలో కంటే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
జ్యేష్ట నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థికపరమైన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. అలాగే వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.