Mercury Retrograde Effect: ఈ రాశులు వారిపై బుధుడి ఊహించని ఎఫెక్ట్.. వీరిపై కుబేరుడి వరాల జల్లు.. డబ్బుకు లోటు ఉండదు!

Sat, 21 Sep 2024-3:20 pm,

బుధుడు తిరోగమన దశగా కదలికలు జరపడం కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తెచ్చి పెట్టవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ అక్టోబర్ నెలలో జాతకంలో అశుభ స్థానంలో ఉన్న రాశుల వారికి అనేక సమస్యలు వస్తాయి. అయితే బుధుడి తిరోగమనంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.   

తులా రాశి వారికి బుధుడు తిరోగమనం చేయడం కారణంగా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. దీంతో వీరు సమాజంలో వివిధ రకాల కార్యక్రమాలు చేయగలుగుతారు. ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఈ సమయంలో మంచి భాగస్వామి లభించి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. ఒంటరి జీవితం గడుపుతున్న వారికి కూడా ప్రేమ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.   

ముఖ్యంగా తులా రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే వివిధ చోట్ల నిలిచిపోయిన డబ్బు సులభంగా తిరిగి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వివిధ రకాల సమస్యలు ఎదుర్కొంటున్న ఈ తులా రాశి వారికి అద్భుతమైన పరిష్కారాలు లభించబోతున్నాయి.   

ఈ అక్టోబర్ నెల మకర రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా అకస్మాత్తుగా కొన్ని ఆదాయ వనరులు కూడా పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారి కైతే ఈ సమయం ఎంతో మేలు చేస్తుంది.   

బుధుడి తిరోగమన ప్రభావం మకర రాశి వారిపై పడి అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో కార్యాలయాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ జీవితంలో శాంతితో పాటు ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే తల్లిదండ్రుల సపోర్టు లభించి మంచి పనులు కూడా చేయగలుగుతారు. 

కన్యా రాశి వారిపై కూడా బుధుడి ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి విశేష లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా చూస్తే కన్యా రాశి వారికి అనేక రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వివిధ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. అలాగే అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు.   

కన్య రాశి వారు ఈ సమయంలో ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే అధిక మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే మానసిక జీవితం కూడా ఎంతో ఆహ్లాద ఫలితంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గి మనస్సు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link