Satya Nadella: మైక్రోసాఫ్ సీఈఓ సత్య నాదెళ్ల జీతంతో ఒక జిల్లానే బాగు చేయవచ్చు.. అతడి జీతం ఎంతో తెలుసా?
భారతదేశానికి చెందిన సత్య నాదెళ్ల ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికైన విషయం తెలిసిందే.
మైక్రోసాఫ్ట్‌కు 2014 నుంచి సీఈఓగా తెలంగాణకు చెందిన సత్య నాదెళ్ల బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. గతంలో ఊహించని దానికన్నా అత్యధికంగా అతడి వేతనం పెరిగింది.
మైక్రోసాఫ్ట్‌లో అత్యున్నత పదవిలో ఉన్న సత్య నాదెళ్లకు భారీగా వార్షిక వేతనం ఉంది. అతడి జీతంతో తెలంగాణలోని ఒక జిల్లానే అభివృద్ధి చేయవచ్చు.
2024 ఆర్థిక సంవత్సరంలో 79.1 మిలియన్ డాలర్లు వేతనం రూపంలో సత్య నాదెళ్ల అందుకోనున్నారు.
భారత కరెన్సీ ప్రకారం రూ.664 కోట్లు సత్య నాదెళ్ల జీతంగా తీసుకోనున్నారు.
గతేడాది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే తాజాగా పెరిగిన జీతం 63 శాతం ఎక్కువ. గతేడాది అతడి జీతం సుమారు రూ.407 కోట్లు (48.5 మిలియన్ డాలర్లు) ఉంది.
ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ లాభాల్లో దూసుకెళ్లింది. కంపెనీ షేర్లు 31.2 శాతం లాభపడ్డాయి. మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటడం విశేషం.