Mohan Babu: అరెస్ట్ భయంతో దిగివచ్చిన మోహన్ బాబు.. ఎట్టకేలకు క్షమాపణలు
క్రూరంగా దాడి: కుటుంబ గొడవల్లో కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధిపై మంచు మోహన్ బాబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
తీవ్ర చర్యలు: ఈ వ్యవహారంలో పోలీసులు, జర్నలిస్టులు తీవ్రంగా పరిగణించి మోహన్ బాబుపై తీవ్ర చర్యలకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కేసు నమోదై.. న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కూడా లభించలేదు.
అరెస్ట్ భయం: అరెస్ట్ తప్పదని భావించిన మోహన్ బాబు ఎట్టకేలకు బాధిత జర్నలిస్ట్‌ను కలిసి క్షమాపణలు కోరాడు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చేరుకుని జర్నలిస్టు లోకానికి క్షమాపణలు చెప్పాడు.
పరామర్శ: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్ బాబు పరామర్శించాడు. తన వల్లే తప్పిదం జరిగిందని బాధిత కుటుంబసభ్యులను క్షమాపణలు చెప్పాడు.
బతిమాలాడడం: 'గాయం బాధ ఏంటో నాకు తెలుసు.. నువ్వు తొందరగా కోలుకోవాలి. ఉద్దేశపూర్వకంగా నిన్ను కొట్టలేదు' అని బాధితుడితో మోహన్ బాబు అన్నట్లు సమాచారం.
విష్ణు క్షమాపణ: 'నా వాళ్ల జరిగిన తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నా' అని మోహన్ బాబుతోపాటు అతడి కుమారుడు మంచు విష్ణు కూడా క్షమాపణలు కోరాడు.
జర్నలిస్టు సమాజానికి: 'గాయం నుంచి తొందరగా బయటపడాలని షిరిడీ సాయి నాథుడిని వేడుకుంటున్నా' అని మోహన్ బాబు చెప్పగా.. బాధిత జర్నలిస్టు 'క్షమాపణలు నాకు కాదు. జర్నలిస్టు సమాజానికి చెప్పాలి' అని కోరాడు.