Mohan Babu: అరెస్ట్ భయంతో దుబాయి పారిపోయిన పెదరాయుడు..? ఆ క్లారిటీతోనే అలా చేయాల్సి వచ్చిందా?
మోహన్ బాబు ఆస్తి వివాదం వల్ల తండ్రికొడుకుల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. జల్ పల్లిలోని ఫామ్‌హౌస్ కోసమే గొడవలు జరుగుతున్నాయి అని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్‌బాబు, మనోజ్ మధ్య గొడవలు పెరిగాయి.
అయితే, ఆ మధ్య మనోజ్ ఫామ్ హౌస్‌లోకి బలవంతంగా వెళ్లే ప్రయత్నం చేశాడు. గేటు బద్దలు కొట్టుకుని లోనికి వెళ్లాడు. అక్కడ ఉన్న మీడియా కూడా లోపలికి వెళ్లింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన మోహనబాబు టీవీ9 రిపోర్టర్‌పై దాడిచేశాడు.
దీంతో అతనికి గాయలు అయ్యాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో మోహనబాబు కూడా చేరారు. తర్వాత సదరు రిపోర్టర్ కు సారీ కూడా చెప్పారు. అయితే, దాడి చేసినందుకు పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. బౌన్సర్లను కూడా బైండోవర్ చేయమన్నారు.
మీడియా రిపోర్టర్‌పై దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజకీయ,సినీ ప్రముఖులు కూడా దీన్ని ఖండించారు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా విచక్షణ కోల్పోవడం ఏంటి అని ప్రశ్నించారు. అయితే అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాబట్టి పెదరాయుడు కూడా అరెస్ట్ భయంతోనే దుబాయి పారిపోయాడనే వార్తలు వస్తున్నాయి.
దుబాయిలో మంచు విష్ణు ఉంటారు. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినట్లు వీడియోలు సైతం బయటకు వచ్చాయి అక్కడి నుంచి మోహనబాబు బెంగళూరు నుంచి దుబాయి వెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు ఆయన అరెస్ట్ భయంతోనే దుబాయి పారిపోవాల్సి వచ్చింది అని కామెంట్లు పెడుతున్నారు.