Mohan Babu: `ఈమె కూడా డేంజరే!`.. మంచు విష్ణు భార్య గురించి మోహన్ బాబు
మంచు మోహన్ బాబు పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు ఆస్తి వివాదాలు కుటుంబ కలహాలతో మంచు మోహన్ బాబు మంచు మనోజ్ ల మధ్యగొడవ రోజు రోజుకి పెరుగుతూ వస్తోంది. నిన్న మొన్నటిదాకా నాలుగు గోడల మధ్య ఉన్న ఈ గొడవలు ఇప్పుడు మీడియా ముందుకి వచ్చేశాయి.
ఆస్తి విషయంలో మోహన్ బాబు మంచు మనోజ్ కి అన్యాయం చేశారు అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మనోజ్ భూమా మౌనికాని రెండవ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడం వల్లే మోహన్ బాబు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఇందులో నిజాలు గురించి పక్కన పెట్టేస్తే గతంలో మోహన్ బాబు తన మొదటి కోడలు (మంచు విష్ణు భార్య) గురించి చెప్పిన ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోహన్ బాబు తన పెద్ద కోడలు మంచో విరానిక ను పరిచయం చేస్తూ ఆమెను "ఎందుకు వచ్చావు" అని అడిగారు. "మీకు పెరుగన్నం ఇవ్వడానికి" అని ఆమె జవాబు ఇవ్వగా.. మోహన్ బాబు "ఈమె పెరుగన్నం చేయడంలో స్పెషలిస్ట్" అనే కితాబు ఇవ్వడమే కాక పక్కనే ఉన్న మంచు లక్ష్మీ వైపు చూపిస్తూ ఈమె నా మొదటి కూతురు అయితే ఈమె నా రెండవ కూతురు అంటూ విన్నీ వైపు చూపించారు మోహన్ బాబు.
"నా రెండవ కూతురు కూడా డేంజరే" అని మోహన్ బాబు కామెంట్ చేయగా పక్కనే ఉన్న మంచు లక్ష్మి "ఆడవాళ్లు కొంచెం స్ట్రాంగ్ మా ఫ్యామిలీలో" అని చెప్పింది. "పైకి సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ ఈమె పెద్ద రౌడీ. నిజంగా తను వచ్చింది తన భర్త కోసం.. నేనేం అనుకుంటానో అని పెరుగన్నం తీసుకొచ్చాను అంకుల్" అని చెప్తోంది అని కామెంట్ చేశారు మోహన్ బాబు.
ఒకవైపు మోహన్ బాబు ఇంట్లో ప్రస్తుతం జరుగుతున్న గొడవలు వైరల్ అవుతూ ఉండగా.. తన పెద్ద కోడలు గురించి మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ వీడియో కూడా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొందరేమో మంచు విష్ణు భార్య ని కూతురిలాగా ఒప్పుకోగలిగిన మోహన్ బాబు మంచు మనోజ్ భార్యను ఎందుకు ఒప్పుకోవడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా మంచు ఇంట గొడవలు ఎప్పటికి కుదుటపడతాయో చూడాలి.