Mohini ekadashi 2024: మరో రెండు రోజుల్లో మోహినీ ఏకాదశి..?.. దీని వెనుక ఉన్న ఈ స్టోరీ మీకు తెలుసా..?

Fri, 17 May 2024-3:07 pm,

దేవదానవులు ఒకప్పుడు క్షీరసాగర మథనం చేపడతారు. అప్పుడు అమృత కలశం సముద్ర గర్భం నుంచి పైకి వస్తుంది.  ఆసమయంలో.. అమృత కలశం తీసుకుని దానవులు పారిపోతారు. ఆ అమృత కలశం దానవులకు దొరికితే అది తాగుతారు. దాని వల్ల వాళ్లు అమరులుగా మారి లోకకంటకులుగా మారుతారు. అందుకే శ్రీ మహావిష్ణువు మహా అందమైన మోహీని అవతారం వేసుకుని భూమి మీదకు వస్తాడు.  

అమృత కలశం కోసం గొడవలు ఎందుకని, తాను సమానంగా పంచుతానంటూ చెబుతారు. అప్పుడు దానవులకు అమృత కలశంలోని, అమృతం తాగించకుండా, కేవలం దేవుళ్లకు మాత్రమే అమృతం తాగిస్తాడు. దానవులను తన అందచందాలతో డైవర్ట్ చేస్తాడు. కానీ, ఒక దానవుడు ఇది గ్రహించి, దేవుళ్ల మాదిరిగా వేషం ధరించి దేవుళ్లపక్కన వరుసలో కూర్చుంటాడు.  మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహా విష్ణువు ఇది గమనించకుండా అమృతం ధారగా పోస్తాడు.  

ఇంతలో అతగాడి మీద అనుమానంలో.. దానవుడని గ్రహించి వెంటనే తన సుదర్శన చక్రంలో అతని తల, మొండెం వేరు చేస్తాడు. కానీ అప్పటికే అమృతం తాగేయడం వల్ల అమరుగా మారిపోతారు. రాహు, కేతువులుగా మారి తరచుగా చంద్రుడ్ని, సూర్యుడికి మింగుతూ గ్రహానానికి కారణమౌతుంటారు.

వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అనిపిలుస్తారు. ఈసారి మే 19 వ తేదీన మోహిని ఏకాదశి వస్తుంది. ఈరోజు భక్తులు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహాస్రనామం చదవడం వల్ల మంచి శుభఫలితాలు కల్గుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

ఏకాదశి రోజున ముఖ్యంగా విష్ణు ఆలయాలకు వెళ్లి, టెంపుల్స్ ను అందంగా దీపాలతో డెకోరేట్ చేయాలి. అంతేకాకుండా.. శ్రీ మహా విష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి, ఆయనను రకరకాల పూవ్వులతో అలంకరిస్తే ఆయన ప్రసన్నం అవుతాడని చెబుతుంటారు. పట్టు వస్త్రాలు, ధూప, దీపం, నైవేద్యాలను భక్తితో సమర్పించుకోవాలని పండితులు చెబుతున్నారు.

మోహిని ఏకాదశి రోజున ఏ జపంచేసిన, ఎలాంటి పూజలు చేసిన, ధ్యానం చేసిన అది రెట్టింపు లాభం చేకూరుస్తుందని చెబుతారు. పెళ్లికానీ వారు, జీవితంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు మోహిని ఏకాదశిరోజున పరిహారాలు పాటించాలని చెబుతున్నారు.

ఈరోజు గోశాలకు వెళ్లి ఆవులకు గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన లడ్డులన తినిపించాలి. అంతేకాకుండా.. ఆవులకు అరటి పండ్లు, గరక లను తినిపించాలని పండితులు చెబుతున్నారు. పేదలకు దాన ధర్మాలు చేయడం, నీటి వసతిని కల్పించడం వల్ల మంచి ఫలితాలు కల్గుతాయని చెబుతుంటారు. నల్ల చీమలకు చక్కెరను తినిపించడానికి వేయాలి.

ఈరోజు అనేక ప్రాంతాలలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేయిస్తుంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే జీవితంలో మంచి ఫలితాలు, గత జన్మలో చేసుకున్న పాపాలు అన్ని కూడా నశించి పోతాయని పండితులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link