Monsoon Skin Care: వర్షాకాలంలో మీ చర్మం జడ్డుగా మారుతోందా, ఈ టిప్స్ ట్రై చేయండి

Wed, 03 Jul 2024-6:25 pm,

వేప

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. పింపుల్స్ వంటి సమస్యల్నిచాలా సులభంగా తగ్గిస్తుంది. 

వర్షాకాలంలో శరీరం చికాగ్గా ఉంటుంది. ముఖ్యంగా చర్మం విసుగు తెప్పిస్తుంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి మరింత చికాగ్గా ఉంటుంది. చర్మం దెబ్బతినే అవకాశాలున్నాయి

పసుపు-చందనం

రెండు చెంచాల చందనం పౌడర్, చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తురవాత చల్లని నీళ్లలో శుభ్రం చేసుకోవాలి.

శెనగపిండి-పెరుగు

ఒక స్పూన్ శెనగపిండిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు 15 నిమిషాలు పట్టించాలి. ఆ తరువాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. 

అల్లోవెరా జెల్

పింపుల్స్, మొటిమల నుంచి విముక్తి పొందాలంటే అల్లోవెరా జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ముఖానికి అల్లోవెరా జెల్ రాసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link