Toilet Doors: ఆఫీసు లేదా మాల్స్ Toilet Doors పూర్తిగా క్లోజ్ చేసుండవు, ఎందుకో తెలుసా
మాల్స్ Toilet Doors అడుగున కట్ చేసి ఉంటాయి. అంటే అడుగు వరకూ ఉండవు. దీనివెనుక రాకెట్ సైన్స్ అంటూ లేదు కానీ కారణం మాత్రం ఉంది
మాల్స్ , థియేటర్ Toilets వాడకం ఎక్కువగా ఉంటుంది. దాంతో తలుపులు త్వరగా పాడయ్యే అవకాశముంటుంది. అందుకే ఇలా కట్ చేసి ఉంచుతారు. అన్నింటికంటే ముఖ్యంగా వైపర్ సహాయంతో సులభంగా క్లీనింగ్ కు వీలవుతుంది
ఏదైనా ప్రమాదం జరిగినా ఈ డోర్స్ సులభంగా తొలగించవచ్చు
అడుగున కట్ చేసుంటే డోర్స్ ఎక్కువ కాలం మన్నుతాయి. వెలుతురు, వెంటిలేషన్ బాగుంటుంది. లోపల ఎవరికైనా అకస్మాత్తుగా ఆరోగ్యం పాడయినా రెస్క్యూ చేసేందుకు వీలుంటుంది
ఆఫీసు లేదా మాల్స్ లో Toilet Doors చిన్నవిగా అంటే అడుగు వరకూ పెట్టకుండా కట్ చేసి ఏర్పాటు చేయడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. దిగువ ఓపెన్ చేసుండటం వల్ల క్లీనింగ్ సులభమౌతుంది. బయట్నించే క్లీన్ చేయవచ్చు.