Hindu State in Muslim Country: ముస్లిం దేశంలో హిందువుల ప్రాబల్యం, ఎక్కడో తెలుసా
హిందువులు అత్యధికంగా ఉండే బాలీ
ఇండోనేషియాలోని బాలీ ద్వపంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ 87 శాతం హిందువులే ఉన్నారు. ఈ ప్రాంతాన్ని ఐల్యాండ్ ఆఫ్ గాడ్స్ అంటారు. వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది. మొదటి శతాబ్దంలో ఇక్కడ హిందువులు పెద్ద సంఖ్యలో ఉండేవారని తెలుస్తోంది. బాలీ ద్వీపంతో పాటు జావా, సుమిత్రా దీవుల్లో కూడా చాలా ఆలయాలు నిర్మించారు. ఇక్కడ నదుల పేర్లు కూడా గోమతి, గంగా అని ఉండేవి. 13వ శతాబ్దం నుంచి ఇస్లాం ఈ దేశంలో వేగగా విస్తరించింది. బౌద్ధం, హిందూ మతస్థులు సైలెంట్‌గా ఉండిపోయారు. అందరూ క్రమంగా బాలీలో స్థిరపడ్డారు. ఆ తరువాత ఇండోనేషియా దేశం డచ్ పాలనలో వెళ్లింది
ముస్లిం దేశం ఇండోనేషియా నేపధ్యం
ప్రపంచంలో ముస్లిం జనాభా అధికంగా కలిగిన దేశం ఇండోనేషియా. ఇస్లాం మతం ఆవిర్భావానికి పూర్వం ఈ దేశంలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా కలిగిన దేశంగా మారింది. అయినా సరే ఈ దేశంలోని ఓ ప్రాంతంలో హిందూ దేవతల నగరం రూపంలో ఓ ప్రాంతం ప్రాచుర్యంలో ఉంది
ఇండోనేషియాలో హిందూ జనాభా
స్వాతంత్య్రం లభించిన తరువాత ఇస్లామ్ ప్రాబల్యం పెరిగింది. ఏకేశ్వరోపాసన మతానికి ప్రాధాన్యత లభించింది. హిందువులను ప్రత్యేకంగా చూసేవారు. 1952 నుంచి ఇస్లాం మతం స్వీకరించేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. క్రమంగా బాలి ద్వీపంలో టెన్షన్ పెరిగింది. హిందూ మతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వచ్చింది. 1959లో నెహ్రూ కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వాలన కోరారు. ఆ తరువాత క్రమంగా 1962లో హిందూ మతానికి అధికారికంగా గుర్తింపు లభించింది.
దక్షిణ భారతదేశం నుంచి నేరుగా జలసంధి
ప్రపంచపటంలో దక్షిణ భారతదేశం నుంచి తూర్పు దిశవైపు చూస్తే హిందూ మహాసముద్రంలో మలేషియాకు ఎగువన ఇండోనేషియా కనిపిస్తుంది. ఇక్కడే మధ్యలో బాలి ద్వీపం కనిపిస్తుంది. ఇక్కడ చాలా ప్రాంతాల్లో గణేశుని విగ్రహాలు చూడవచ్చు. ఇక్కడి ఆలయాల్లో దక్షిణ భారతదేశం నిర్మాణ శైలి ఉంటుంది.
ఇండోనేషియాలోని మిగిలిన దీవుల్లో ముస్లింలదే ప్రాబల్యం ఎక్కువ. బాలీ ద్వీపంలో మాత్రం హిందువులదే ఆధిపత్యం. ఇక్కడ కూడా రోజుకు మూడు సార్లు ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం పూజలు జరుగుతాయి. ఈ దేశంలో శివుడిని మహారాజా దేవ్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు పూజలు జరుగుతాయి.
ముస్లిం దేశంలో గణేశుని మందిరం
ఇండోనేషియాలో గణేశుని మందిరం చూడవచ్చు. బాలి ద్వీపం నుంచి వెళ్లేవారు తప్పకుండా ఈ మందిరాన్ని సందర్శిస్తుంటారు