Star Heroine: సినీ కెరీర్ లో చాలా మంది హీరోలతో ఎఫైర్స్.. సినీ ఇండస్ట్రీని కనుసైగతో శాసించిన స్టార్ హీరోయిన్.. ఇంతకీ ఎవరామె.. ?

Sun, 15 Sep 2024-12:10 pm,

రేఖ రియల్ లైఫ్..  ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ తెరకెక్కించిన 'అంతులేని కథ' తరహాలో ఉంటుందనే చెప్పాలి. స్టార్ హీరో కూతురు అయినా.. ఎన్నో వివక్షలను ఎదురొద్ది పోరాడి నిలిచింది. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఈ రేంజ్ కష్టాలు అనుభవించిన నటి బహుశా ఎవరు ఉండరేమో.

తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు ఈమె వ్యక్తిగత జీవితం కూడా ఎంతో వివాదాస్పదం. అది ఒక సినిమాకు మించిన ట్విస్టులు ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఉన్నాయి.

రేఖ పేరుతో ముడిపడి ఉన్న ఫస్ట్ హీరో అమితాబ్ బచ్చన్ అని అందరు అనుకుంటారు. కానీ రేఖ లైఫ్ ముందుగా అప్పటి అగ్ర హీరో జితేంద్రతో స్టార్ట్ అయింది. ఆ హీరోతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పటికే జితేంద్ర పెళ్లైన వాడు కావడంతో ఈ బంధానికి బై బై చెప్పేసింది రేఖ.

ఆ తర్వాత బాలీవుడ్‌లో విలన్‌గా రాణిస్తోన్న కిరణ్ కుమార్ అనే ప్రముఖ నటుడితో తన ప్రేమ బంధాన్ని కొనసాగించింది. ఈయన తేజాబ్, ఖుదాగవా వంటి పలు సినిమాల్లో మెయిన్ విలన్‌గా నటించారు. ఆపై రేఖ ప్రముఖ హీరో వినోద్ మెహ్రాతో సహ జీవనం కొనసాగించింది. అతన్ని రేఖ సీక్రెట్‌గా పెళ్లిచేసుకుందనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఆ వార్త అబద్దం అంటూ ఓ ఇంటర్వ్యూలో రేఖ చెప్పడం గమనార్హం.

అక అమితాబ్ తో రేఖ అనుబంధం మొత్తం సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. 'దో అంజానే' సినిమాలో వీళ్లిద్దరు ఫస్ట్ టైమ్ కలిసి నటించారు. అప్పటికే అమితాబ్‌కు పెళ్లైనా.. ఎలాంటి మొహమాటం లేకుండా తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పట్లో అమితాబ్, రేఖలు వివాహాం చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ తర్వాత బిగ్ బీ భార్య జయ బచ్చన్ జోక్యం చేసుకొని రేఖతో అమితాబ్ ప్రేమాయణానికి పులిస్టాప్ పడేలా చేసింది. అంతేకాదు   రేఖతో  కలిసి పనిచేయకుండా అమితాబ్‌కు బ్రేకులు వేసిందనే వార్తలు అప్పట్లో బీ టౌన్ లో  గుప్పుమన్నాయి.

అప్పట్లో అమితాబ్ బచ్చన్, రేఖ, జయా బచ్చన్ కలిసి నటించిన 'సిల్‌సిలా' చిత్రం పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. అంతేకాదు అమితాబ్, రేఖ ఎఫైర్ కోసమే యశ్ చోప్రా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అప్పట్లో అందరు చర్చించుకున్నారు. 

హీరోలతో ఎఫైర్స్ తర్వాత ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారి ముఖేష్ అగర్వాల్‌ను రేఖ మ్యారేజ్ చేసుకుంది. అతనితో రేఖ సంసారం సాఫీగా సాగలేదనే విషయాన్ని 'రేఖ.. అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తకంలో పేర్కొంది. ఇక చివరగా ఈమె ఖల్ నాయక్ సంజయ్ దత్ కూడా ఎఫైర్ నడిపిందనే వార్తలు కూడా వినిపించాయి.

వీళ్లిద్దరు 'జమీన్ ఆస్మాన్' సినిమాలో కలిసి నటించారు. తమ మధ్య ఎలాంటి బంధం లేదనే విషయాన్ని వాళ్లిద్దరు ఖండించినా ఈ వార్త మాత్రం ఆగలేదు. మొత్తంగా రేఖ జీవితంలో ఓ సినిమాకు కావాల్సినంత మసాలా ఉంది. అది బయోపిక్ తీస్తే ఓ సినిమాకు కావాల్సినంత వినోదం గ్యారంటీ అనే చెప్పాలి.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link