Bermuda Triangle Secret: బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏం జరుగుతోంది, రహస్యం తెలిసిందా
నిజంగా సముద్రగర్భంలో ఎలియన్స్ సంచారం ఉందా
దీనికి కచ్చితమైన సమాధానం లేదు. ఎవరూ ఇవ్వలేరు కూడా. కొంతమంది జ్యోతిష్యుల ప్రకారం 2026లో బెర్ముడా ట్రయాంగిల్ విషయంలో రహస్యం ప్రపంచానికి తెలియనుంది. సముద్రగర్భంలో బెర్ముడా ప్రాంతంలో ఎలియన్స్ సంచారం ఉందనే థియరీ విన్పిస్తోంది.
బెర్ముడా ట్రయాంగిల్‌కు సంబంధించి మరో థియరీ విన్పిస్తోంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండే ప్రవాహం కారణంగా నలువైపులా భయంకరమైన తుపాన్లు సంభవిస్తుంటాయి. 100 అడుగుల ఎత్తు వరకు భయంకర స్థితి ఉండవచ్చు. అందుకే విమానాలు, ఓడలు చిక్కుకుంటున్నాయి.
మరో థియరీ మేగ్నెటిక్ ఫోర్స్‌కు సంబంధించింది. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమి మధ్యలోంచి పుడుతుంది. అందుకే ఈ ప్రాంతంలో అన్నీఆకర్షితమౌతున్నాయి. పైలట్ లేదా కెప్టెన్‌కు దీని గురించి అర్ధం కాకపోవడంతో చిక్కుకుంటున్నారు
2016లో చేసిన అధ్యయనం ప్రకారం సముద్రగర్భంలో మీథేన్ ఖజానా ఉండటం వల్ల ఆకశ్మిక విస్ఫోటనం జరగవచ్చు.
బెర్ముడా ట్రయాంగిల్ అంటే భయమెందుకు
అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ప్రాంతానికి వెళ్లకుండా విమానాలు, ఓడలు తప్పించుకుంటుంటాయి. ఎందుకంటే దాదాపు 200 విమానాలు, ఓడలు రహస్యంగా ఈ ప్రాంతంలో మాయమయ్యాయి. దశాబ్దాలుగా అణ్వేషణ జరుగుతున్నా జాడ తెలియలేదు. అసలీ ప్రాంతంలో ఏం జరుగుతోంది, ఎందుకు విమానాలు, ఓడలు మాయమౌతున్నాయని ప్రశ్నించుకున్నప్పుడు ఎలియన్స్ థియరీ వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో విమానాలు , ఓడలు మాయం వెనుక యూఎఫ్ఓ హస్తముందని అనుమానం. ఈ ప్రాంతంలో ఎలియన్ రీసెర్చ్ సెంటర్ ఉండి ఉండవచ్చని అంటున్నారు. ది సన్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం ఈ ప్రాతంలో ఎలియన్స్ రీసెర్చ్ చేసేందుకు విమానాలు, ఓడలు మాయం చేస్తోందని ఉంది.
బెర్ముడా ట్రయాంగిల్ ఎక్కడ ఉంది
ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో అంటే ఉత్తర అమెరికా ఖండం తూర్పు ప్రాంతంలో అంటే అమెరికాకు దిగువున కన్పించే ఫ్లోరిడా వైపు కన్పిస్తుంది. అక్కడ తూర్పు సముద్రభాగాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. మరోవైపు మియామీ, ఇంకోవైపు శ్యాన్ జువాన్ ఉన్నాయి.