Sun Never Sets: రవి అస్తమించని దేశాలేంటో తెలుసా, ఈ దేశాల్లో అసలు రాత్రే ఉండదు

Fri, 11 Oct 2024-5:44 pm,

స్వీడన్

మే నెల ప్రారంభం నుంచి ఆగస్టు నెల చివరి వరకూ స్వీడన్‌లో సూర్యుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. తిరిగి ఉదయం 4 గంటలకు ఉదయిస్తాడు. 6 నెలలు సూర్యుడు ఇక్కడ అస్తమించడు.

బైరో, ఆలాస్కా

మే నెలాఖరు నుంచి జూలై చివరి వరకూ ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు. ఆ తరువాత నవంబర్ ప్రారంభం నుంచి నెలరోజుల వరకూ సూర్యుడు ఉదయించడు. దీనినే పోలార్ నైట్ అంటారు. అంటే ఈ దేశంలో చలికాలం అంతా చీకట్లో ఉంటుంది

ఐస్‌ల్యాండ్

యూరప్‌లో గ్రేట్ బ్రిటన్ తరువాత అతిపెద్ద ఐస్‌ల్యాండ్. జూన్ నెలలో ఈ దేశంలో సూర్యుడు అస్తమించడు

నునావృత్ - కెనడా

ఈ ప్రాంతం ఆర్కిటిక్ సర్కిల్ నుంచి 2 డిగ్రీలు ఎగువన కెనడాకు నార్త్ ఈస్ట్‌లో ఉంది. ఈ ప్రాంతంలో రెండు నెలల వరకు 24 గంటలు సూర్యుడు ఉదయించే ఉంటాడు. చలికాలంలో 30 రోజులు చీకటి ఉంటుంది.

నార్వే

ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉన్న ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ ద మిడ్‌నైట్ అంటారు. ఈ దేశంలో మే నుంచి జూలై వరకూ సూర్యుడు అస్తమించడు. అంటే 76 రోజులపాటు సూర్యుడు కన్పించకుండా ఉండడు. నార్వేలోని స్వాల్‌బర్డ్‌లో సూర్యుడు ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు కన్పిస్తూనే ఉంటాడు. 

ప్రపంచంలో సూర్యుడు ఉదయించని దేశాలు, అస్తమించని దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అసలు సూర్యుడే కన్పించడు. కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు కన్పించకుండా ఉండదు

ఫిన్‌ల్యాండ్

ఇక్కడ వేలాది ఐల్యాండ్స్ ఉంటాయి. వేసవిలో ఫిన్‌ల్యాండ్‌లో వరుసగా 73 రోజులు సూర్యుడు కన్పిస్తూనే ఉంటాడు. చలికాలంలో సూర్యుడు ఉదయించడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link