Mouni roy marriage: పెళ్లి చేసుకోనున్న మౌనీ రాయ్..పెళ్లి కొడుకు ఎవరో తెలుసా
సముద్ర తీరాన...మౌనీరాయ్. ఎల్లో బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్‌లో కన్పిస్తూ అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఈ పోజులో మౌనీ చాలా అందంగా కన్పిస్తోంది.
పెళ్లి విషయం తెలిశాక..అభిమానులంతా మౌనీరాయ్, సూరజ్ నంబియార్‌లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మౌనీరాయ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.
మౌనీరాయ్ చాలాకాలంగా సూరజ్ నంబియార్ అనే ఓ బ్యాంకర్‌తో డేట్ చేస్తోంది. సూరజ్ నంబియార్ దుబాయ్‌లో ఉంటున్నారు. త్వరలో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట.
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ తలెత్తినప్పుడు కూడా మౌనీరాయ్ దుబాయ్‌లోనే ఉందట. చాలా నెలల పాటు అక్కడే ఉండిపోయింది.
గత కొద్దికాలంగా మౌనీ రాయ్ దుబాయ్ చుట్టూ తిరుగుతోంది. దుబాయ్‌లో ఎంజాయ్ చేసే ఫోటోల్ని కూడా షేర్ చేస్తోంది. దుబాయ్‌లోని తన బాయ్‌ఫ్రెండ్ సూరజ్ నంబియార్‌ను కలవడానికే మౌనీ రాయ్ దుబాయ్ వెళ్తోందని సమాచారం.