MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్.. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటూ..!
ఎప్పుడు కూటమి నేతలను టార్గెట్‌గా ట్వీట్స్ వేసే విజయసాయిరెడ్డి తొలిసారి.. పవన్ కళ్యాణ్‌ను ప్రశసించడం చర్చనీయాంశంగా మారింది.
ఇక తనకు ఏపీ సీఐడీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు తన బినామీ కేవీ రావుతో తప్పుడు కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కక్ష పూరితంగానే తనపై లుకౌట్ నోటీసులు జారీ చేయించారని అన్నారు. తాను సీబీఐ అనుమతి లేకుండా దేశందాటి వెళ్లనని చంద్రబాబుకు తెలుసు అని అన్నారు.
అయినా తన పరువుకు భంగం కలిగించేలా లుకౌట్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. గతంలో కేవీరావుపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను విజయసాయి రెడ్డి గుర్తు చేశారు.
సింగపూర్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా కేవీ రావు బ్రోకర్ పనులు చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడ పోర్టును కేవీ రావుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.