Mr Bachchan Vs Double Ismart: ఒకే రూట్లో రవితేజ, రామ్ పోతినేని.. మరోసారి ఆ ఇద్దరు దర్శకులనే నమ్ముకున్న హీరోలు..

Wed, 14 Aug 2024-7:30 am,

రవితేజ - హరీష్ శంకర్ (మిస్టర్ బచ్చన్): రవితేజ, హరీష్ శంకర్  కలయికలో గతంలో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలొచ్చాయి. అందులో షాక్ నిజంగానే షాక్ ఇస్తే.. మిరపకాయ్ సినిమా మాత్రం సక్సెస్ అయింది. తాజాగా ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో 'మిస్టర్ బచ్చన్'సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతో రవితేజకు హరీష్ శంకర్ హిట్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.

రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ (డబుల్ ఇస్మార్ట్): ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కలయికలో ఇపుడు 'డబుల్ ఇస్మార్ట్' సినిమా మరికొన్ని గంటల్లో రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. 

ఎన్టీఆర్ - కొరటాల శివ (దేవర పార్ట్ -1): ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దేవర సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ‘దేవర 2’ విడుదల కాబోతుంది.  

 

బాలకృష్ణ - బోయపాటి శ్రీను (అఖండ 2): ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రభాస్ - ప్రశాంత్ నీల్.. (సలార్  పార్ట్ 2 శౌర్యంగా పర్వం): ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన 'సలార్ సీజ్ ఫైర్ పార్ట్ -1' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇపుడు వీళ్ల కాంబినేషన్ లో రాబోతున్న  'సలార్ - 2 శౌర్యంగ పర్వం' రాబోతుంది. 

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ (AA -TS4):

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హిట్రిక్ హిట్స్ నమోదు చేసారు. త్వరలో వీళ్ల కలయికలో నాల్గో సినిమా ప్రకటించారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link