Mrunal Thakur: చీరలో మృనాల్ పాప వయ్యారాలు చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే..
ఒకే ఒక్క సినిమా కూడా.. నటుల జీవితాన్ని ఎంతో మార్చేస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ మాట అందరికన్నా కూడా ఎక్కువ.. మృనాల్ ఠాకూర్ కి వర్తిస్తుంది. ఎందుకంటే.. సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో ఎంతో ప్రత్యేక స్థానం సంపాదించుకునేసింది ఈ హీరోయిన్.
మృనాల్ మొదట్లో కొన్ని సీరియల్స్ లో నటించగా.. ఆ తరువాత హిందీ జెర్సీ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాని.. అదే దర్శకుడు గౌతమ్.. హిందీలో కూడా తెరకెక్కించారు.
ఇక షాహిద్ కపూర్ పక్కన మృనాల్ హీరోయిన్ గా నటించి మంచి విజయం అందుకుంది. ఇక అప్పుడే సీతారామం చిత్రంలో కూడా అవకాశం తెచ్చుకునింది. ఈ చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ.
ఇక ఈ చిత్రం తరువాత నానితో చేసిన హాయ్ నాన్న చిత్రం.. ఈ హీరోయిన్ కి మరింత పేరు తెచ్చి పెట్టింది. యశ్నా అనే పాత్రలో కనిపించి.. మరోసారి తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రేమను దక్కించుకుంది ఈ హీరోయిన్.
ఇక ఈ హీరోయిన్ కి ఎదురు లేదు అనుకున్న సమయంలో.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో దిజాస్టర్ అందుకొని.. హ్యాట్రిక్ అందుకోలేకపోయింది మృనాల్. అయినా కానీ ప్రస్తుతం ఈమెకు తెలుగులో మంచి క్రేజే ఉంది.
ఈ క్రమంలో ఈమె ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరోయిన్ చీరలో షేర్ చేసే ఫోటోలు ఆమె అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ.. అలరిస్తూ ఉంటాయి.