Mukesh Ambani House Pics: మైండ్ బ్లాక్ అయ్యేలా ముఖేష్ అంబానీ ఇల్లు.. ఆ ఫ్లోర్‌లోనే ఎందుకు ఉంటున్నారో తెలుసా..!
ఆంటిలియా భవనంలో నీతా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్, పృథ్వీ అంబానీ, వేదా అంబానీ అందరూ కలిసి ఉంటున్నారు.
ఈ ఇంటిని చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్స్ రూపొందించారు. ఆస్ట్రేలియన్ కంపెనీ లాంగ్టన్ హోల్డింగ్స్ నిర్మాణం పూర్తి చేసింది. లోపల సకల సౌకర్యాలతో ఇంద్రభవనంలా నిర్మించారు.
అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ఫాంటమ్ ద్వీపం ఆధారంగా ఈ ఇంటికి ఆంటిలియా అని పేరు పెట్టారు. ఈ భవనంపై మూడు హెలిప్యాడ్‌లను నిర్మించారు.
ఆంటిలియా 37,000 చదరపు మీటర్లలో విస్తరించింది. ఈ భవనం ఎత్తు 173 మీటర్లు కాగా.. 168 కార్లను పార్క్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. 9 హై-స్పీడ్ లిఫ్ట్‌లు ఉన్నాయి.
ఈ ఇంటి కోసం రూ.15 వేల కోట్లను వెచ్చించినట్లు తెలిసింది. ఈ ఇల్లు భారీ భూకంపాలను తట్టుకోగలదు. రికార్టు స్కేలుపై 8 తీవ్రతతో వచ్చినా.. ఆంటిలియా భవనం మాత్రం చెక్కు చెదరదు.
ఈ భవనంలో ఆలయం, స్పా కూడా ఉన్నాయి. ఒక్కో అంతస్తు ఒక్కో విధంగా డిజైన్ చేశారు.
అంబానీ కుటుంబం ఈ భవనంలో 26వ అంతస్తులో నివసిస్తోంది. ఈ ఫ్లోర్‌లోని ప్రతి గదికి మంచి సూర్యకాంతి, గాలి ఉంటుంది. ఈ అంతస్తులో అంబానీ కుటుంబానికి చెందిన సన్నిహితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందట.