Re Release Highest Collections Movies: ‘మురారి’ సహా రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు చిత్రాలు ఇవే..

Wed, 14 Aug 2024-7:00 am,

మురారి: మహేష్ బాబు హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 8.52 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ ప్లేస్ ఉంది. ఫస్ట్ డే మాత్రం రూ. 2.93 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

ఖుషీ: పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరో, హీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషీ’. రీ రిలీజ్ లో మొత్తంగా రూ. 7.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  తాజాగా మురారి మూవీ రాకతో ఈ సినిమా సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కానీ ఈ చిత్రం రీ రిలీజ్ లో మొదటి రోజు రూ. 1.65 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

బిజినెస్ మ్యాన్: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘బిజినెస్ మ్యాన్’. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ. 5.85 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 3లో నిలిచింది. కానీ బిజినెస్ మ్యాన్ రీ రిలీజ్ లో ఫస్ట్ డే రూ. 2.46 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిం

సింహాద్రి: ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సింహాద్రి’.  ఈ సినిమా రీ రిలీజ్ లో రూ. 4.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి టాప్ 4లో  నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో రూ. 1.06 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

ఈ నగరానికి ఏమైంది: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ సినిమా రీ రిలీజ్ లో రూ.3.52 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజు రూ. 81 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link