Must Visit Places On Independence Day: ఆగస్ట్ 15న తప్పక సందర్శించాల్సిన చారిత్రాత్మక ప్రదేశాలు ఇవే..!
ఆగస్టు 15, 2024న మన దేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దేశ భక్తి తో స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం అర్పించిన ఎందరో మహామహుల కథలను మరొకసారి స్మరించుకోవాల్సిన రోజు అది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తే ఎంతో బావుంటుంది. అవకాశం కల్పించుకోవడం ఎందుకు జరగకూడదు? ఈ ప్రదేశాలు మనలో గౌరవం, దేశభక్తిని పెంపొందించే శక్తి కలిగినవే. మన స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, మన దేశాన్ని మరింత మెరుగుపరిచే దిశగా మనం ముందడుగు వేయవచ్చు. మనదేశంలో కొన్ని చారిత్రక ప్రదేశాల జాబితా ఇప్పుడు చూద్దాం..
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన రెడ్ ఫోర్ట్, యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం. ఈ ప్రదేశంలో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత జాతీయ పతాకం ఎగురవేస్తారు. దేశంలో అతిపెద్ద స్మారక చిహ్నంగా ఉన్న ఈ కోటకి భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది.
సెల్యులార్ జైల్ ను కాలపానీ అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర్య పోరాట యోధుల బాధలను గుర్తు చేసే చారిత్రక ప్రదేశం ఇది. ఈ జైలు భవనం గోడలు ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అతి దారుణంగా హత మార్చిన ప్రదేశం ఇది. ఇక్కడ జరిగిన భయానక కథలు మనలో జాతీయాభిమానాన్ని కచ్చితంగా పెంచుతాయి.
1919లో జాలియన్‌వాలాబాగ్ లో జరిగిన నరమేధం చరిత్రలో ఒక అతి భయంకరమైన సంఘటన. ఈ ప్రదేశం స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఎందరో అమాయకుల త్యాగాలకు ఒక గుర్తు. ఇప్పటికీ అక్కడి గోడల మీద ఉండే బులెట్ మరకలు అక్కడ చనిపోయినవారిని మనకి గుర్తు తెస్తాయి.
మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం, స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన కేంద్రమ్. ఎందుకంటే అసలు జాతి పిత మహాత్మా గాంధీ దండి యాత్ర ను ప్రారంభించింది ఈ ప్రదేశం నుండే. ఇది గాంధీజీ నిరాహంకార, ఆత్మనిర్భరతా, సరళ జీవన విధానం లాంటి విలువలకి ప్రతీక.
ఇండియా గేట్ అనేది మన దేశానికి ప్రాముఖ్యమైన స్మారక చిహ్నం. ఇది బ్రిటిష్ ఆర్మీలో సేవ చేసిన 70,000 మంది భారతీయ సైనికుల స్మారకంగా నిర్మించబడింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రదేశంలో రంగురంగుల లైట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. భారతదేశం సంపాదించుకున్న స్వతంత్రాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాయి