Muthyalamma Idol issue: ముత్యాలమ్మ ఆలయం దగ్గర హైటెన్షన్.. ఇంటర్నేట్ సేవల నిలిపివేత.. రంగంలోకి అదనపు బలగాలు..
సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసంపై తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీనిపై హిందుసంఘాలన్ని తీవ్రంగా పరిగణించాయి. ఈ రోజు హిందు సంఘాలన్ని నిరసనలు చేపట్టాయి.
దీనిలో భాగంగా..సికింద్రాబాద్ లో నిరసనలు చేపట్టారు. ఈరోజు బంద్ కూడా ప్రకటించాయి. అయితే.. పెద్ద ఎత్తున నిరసన కారులు చేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడ హిందు సంఘాలన్ని తమకు న్యాయం చేయాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు సైతం చేస్తున్నారు
ఈ క్రమంలో అక్కడ హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తు సలీం బస చేసిన లాడ్జీవైపు దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున తోపులాట సంభవించింది. దీనిలో నిరసన కారులు తొక్కిసలాటకు గురైనట్లు సమాచారం.
పోలీసులకు , స్థానికులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరుగుతుంది. దీంతో అక్కడ మాత్రం.. ఒక్కసారిగా ఇంటర్నేట్ సేవలు సైతం బంద్ చేసినట్లు తెలుస్తోంది. కొంత మంది పోలీసులు అత్యుత్సాహాం ప్రదర్శించి లాఠీ చార్జ్ చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అక్కడ కొంత మంది నిరసన కారులు.. మాత్రం పోలీసుల మీద ప్యాకెట్ లు, చెప్పుల్ని సైతం విసిరినట్లు తెలుస్తోందీ. ప్రస్తుతం అయితే..అక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు మాత్రం కొనసాగుతున్నాయి.
తమ ఆలయం మీద దాడిచేసిన నిందితుడ్ని మాత్రం కఠినంగా పనిష్మెంట్ చేయాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. దీనిపై ఇప్పటి దాక రేవంత్ సర్కారు స్పందించకపోవడం దారుణమన్నారు.
ఇప్పటికైన సీఎం రేవంత్ ఈగోలకు పోకుండా.. అమ్మవారి ఆలయంకు వచ్చి.. అమ్మవారికి దండం పెట్టుకుని, యావత్ హిందు సమాజానికి తప్పుపై ప్రాయిశ్చిత్తం చేసుకొవాలని కూడా నిరసన కారులు డిమాండ్ చేస్తున్నారు.