Muthyalamma temple: మూడు రోజుల పాటు కుంభాభిషేకం.. ఈ సారి ప్రతిష్టించే విగ్రహాం ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?..

Tue, 22 Oct 2024-2:46 pm,

సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ దగ్గర ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనిపై హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి.   

ఇటీవల దీనిపై సికింద్రాబాద్ వ్యాప్తంగా బంద్ సైతం పాటించాయి. దీనిపైన పెద్ద రచ్చ నెలకొంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసన  కారులు ముత్యాలమ్మ ఆలయం దగ్గరకు చేరుకున్నారు. అంతే కాకుండా నిరసనలు చేపట్టారు.   

ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు నిందితుడికి లేనీ పోనీ సదుపాయాలు కల్పిస్తున్నారని,అతను ఉద్దేశ పూర్వకంగానే ఈ ఆలయం ధ్వంసంకు పాల్పడినట్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడ్ని తమకు అప్పగిస్తే.. తామే.. అతడ్ని అమ్మవారికి బలిస్తామని కూడా ఆగ్రహాం వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో మొదల ముత్యాలమ్మ ఆలయం దగ్గర విగ్రహాం ఏర్పాటుకు ఈరోజు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. పూజారులతో స్థానికులతో కలిసి ముత్యాలమ్మ ఆలయంలో సమావేశమయ్యారు. విగ్రహా ప్రతిష్టాపన కోసం మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. శాంతిపూజ, యంత్రలా స్థాపన చేస్తామన్నారు.

అదే విధంగా ఈసారి మూడున్నర అడుగుల విగ్రహాంను ప్రతిష్టాపన చేయనున్నట్లు తెలుస్తొంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడున్న వాళ్లతో కలిసి విగ్రహా ప్రతిష్టాపనపై చర్చించారు. బస్తివాసులు,శివసత్తులు, జోగినీలు, పసుపు, కుంకుమ, బోనాలతో వచ్చి నైవేద్యాలు సమర్పిస్తారని కూడా తలసాని చెప్పారు.

ముత్యాలమ్మ ఆలయం ప్రతిష్టాపన ఎంతో వైభంగా జరిపేలా చర్యలు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అమ్మవారి విగ్రహం ఎక్కడలేని విధంగా ఆగమ శాస్త్రం ప్రకారం రూపొందించే విధంగా శిల్పికి సూచనలిచ్చామన్నారు. ఈ ఘటనపై మాత్రం వెనక్కు తగ్గేదిలేదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొవాల్సిందేనన్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link