Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల కంటే వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అక్రమయుధాలు కలిగి ఉన్నాడనే కారణంగా జైలు శిక్ష కూడా అనుభవించాడు. తాజాగా ఈయనకు సంబంధించిన ఓ పాత విషయం తెరపైకి వచ్చింది.
సంజయ్ దత్.. కరణ్ జోహార్ తో నిర్వహించే కాఫీ విత్ కరణ్ పోగ్రామ్ లో ఈ సంచలన విషయాలు బయటపెట్టాడు.
ఈ సందర్భంగా తన భార్య ఓ మంత్రితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెసుకున్న సంజయ్.. తన భార్యను చంపేసిన విషయాన్ని ప్రస్తావించాడు. ఈ స్టోరీ మొత్తం సంజూ వివరించేటపుడు.. ఈ షోలో సంజూ బాబాతో పాటు సుస్మితా సేన్ కూడా ఉంది.
సంజయ్ దత్.. ఓ సందర్భంలో మద్రాస్ లోని శివనారి అనే గ్రామంలో ఒక జ్యోతిష్యుడిని కలిసినపుడు అపుడు జరిగిన సంఘటలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆ ఊరి గురించి ఎవరికీ అంతగా తెలియదు. అక్కడ బొటన వేలి చూసి నాడీ జ్యోతిష్యం చెప్పే జ్యోతిష్కులు గురించి చెప్పారు.
ఆ పండితులు తన బొటన వేలు చూసి చెప్పిన విషయాలను విని తన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆ పండితుడు తన నాన్నపేరు బల్ రాజ్ దత్ అన్నారు. ఆయన అసలు సునీల్ దత్. అటు అమ్మ పేరు ఫాతిమా హుస్సేన్ అని చెప్పారు. ఈ విషయాలను చెప్పినపుడు నేను ఒకింత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.
ఇది మాత్రమే కాదు.. గత జన్మలో నేను అశోకుడికి వంశానికి చెందిన రాజు అని నాకు చెప్పాడు. నా భార్య నన్ను యుద్ధానికి పంపుతుంది.అపుడు చాలా మందిని చంపేశాను. ఈ యుద్ధం నుంచి వచ్చిన తర్వాత నా భార్య అక్రమ సంబంధం గురించి తెలిసి.. నేను వారిద్దిరినీ చంపి అడవికి వెళ్లినట్టు జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని ఈ షోలో ప్రస్తావించారు. అంతేకాదు గత జన్మలో తనతో సంబంధం ఉన్న వారు. ఈ జన్మలో కూడా తనను వెంటాడుతున్న విషయాన్ని సంజు చెప్పడం గమనార్హం.