Nabha Natesh: నభా నటేష్ ఆశలు ఆ మూవీపైనే.. రీ ఎంట్రీలో ఇస్మార్ట్ పోరి ఆశలు నెరవేరేనా..!

Wed, 25 Sep 2024-7:00 am,

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇపుడు చేస్తున్న సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తోంది.

నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో  రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కథానాయికగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస చిత్రాలు చేసినా.. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కారణంగా మూవీలకు దూరంగా ఉంది.

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది. 

చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది నభా. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక  తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత రీసెంట్ గా ‘డార్లింగ్’ మూవీతో పలకరించినా.. పెద్ద యూజ్ కాలేకపోయింది. 

నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ మూవీ విషయానికొస్తే..  ఈ సినిమాలో నభా.. స్పిట్ పర్సనాలిటీతో బాధ పడే అమ్మాయి పాత్రలో నటించింది. తాజాగా  విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. త్వరలో నిఖిల్ మూవీ ‘స్వయంభూ’తో హీరోయిన్ గా కెరీర్ గాడిలో పడుతుందా అనేది చూడాలి.

నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది. తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో, డార్లింగ్  సినిమాలతో పలకరించింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link