Nabha Natesh: సాంప్రదాయ చీరకట్టులో పండగ కళతో ఉట్టి పడుతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Tue, 09 Apr 2024-5:00 pm,

నభా నటేష్ .. ఆకర్షించే అందం మరియు యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెట్టింది.

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది.  

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ అక్కడ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో కథానాయికగా పరిచయమైంది.

తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది.

బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్  తాజాగా నిఖిల్ 'స్వయంభూ' మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది నభా. అంతేకాదు ఉగాది సందర్భంగా పండగ కళ మొత్తం తనలో ఉట్టిపడేలా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి వావ్ అనిపించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link