Nabha Natesh: రీ ఎంట్రీ మూవీపై నభా నటేష్ ఆశలు.. డార్లింగ్ మూవీతో ఇస్మార్ట్ పోరి హిట్టు కొట్టినట్టేనా..

నభా నటేష్ .. కన్నడ భామ అయినా.. తెలుగులో రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో కథానాయికగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా.. మధ్యలో చిన్న యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది.

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నభా.
చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఫేవరేట్ హీరోయిన్ గా అయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక తెలుగులో చివరగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మేస్ట్రో’ తర్వాత ఈ భామ ఒక్క సినిమా చేయలేదు.
అప్పట్లో నభా నటేష్ యాక్సిడెంట్ కు గురైయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తాజాగా ‘డార్లింగ్’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దాంతో పాటు ‘స్వయంభూ’ సహా పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
నభా నటేష్ నటించిన ‘డార్లింగ్’ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమాలో నభా.. స్పిట్ పర్సనాలిటీతో బాధ పడే అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నభా నటేష్... శాండిల్ వుడ్ ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో వెండితెరపై కథానాయికగా పరిచయమైంది.