Naga Chaitanya- Sobhita: నాగచైతన్య-శోభిత మధ్య ఏజ్ గ్యాప్.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
2017లో నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సమంత. కాగా తన మొదటి సినిమా హీరో అయినా అక్కినేని వారసుడు, నాగచైతన్యతో ప్రేమలో పడి.. అతన్నే పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదు.
మొదట్లో ఈ జంట ..అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో వీరిద్దరి లాంటి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ.. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇంకెవరికి ఉండదేమో అన్నట్టు అనిపించింది. కానీ కొద్ది రోజులకే.. వారిద్దరి అభిమానులకు షాక్ ఎదురైంది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో.. విడాకులు తీసుకుంది.
ఈ విడాకులకి గల కారణాలు.. పైన అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. అయితే చాలామంది నాగచైతన్యకి.. శోభితతో ఉన్న ప్రేమాయణం వల్లే సమంత విడాకులు.. ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఫైనల్ గా ఇదే వార్త నిజమైంది.
వీరిద్దరూ విరాకులు తీసుకున్న మూడు సంవత్సరాలకు.. నిన్న ఆగస్టు 8న నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక అక్కడి నుంచి అక్కినేని కుటుంబం పై సమంత.. అభిమానులకు మరింత కోపం ఎక్కువైంది. ఈ క్రమంలో సినీ ప్రేక్షకులు మాత్రం నాగచైతన్య, శోభితకి సంబంధించిన..ఎన్నో విషయాల గురించి రీసెర్చ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా వీరిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్.. గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా..చైతన్య, శోభిత మధ్య దాదాపుగా ఆరు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందట. నాగ్ చైతన్య 1986 సంవత్సరంలో జన్మించగా… శోభిత 1992 సంవత్సరంలో జన్మించారు.