Sobhita Dhulipala: నాగార్జునకు కోపం తెప్పించిన శోభితా..?.. రచ్చగా మారిన కాబోయే కోడలి ఫోటో షూట్.. పిక్స్ వైరల్..
నాగచైతన్య శోభిత ధూళి పాళల పెళ్లి వేడుక డిసెంబరు 4 న జరగనున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.దీనిపై ఇప్పటికే పెద్ద రచ్చ నెలకొంది. వీరి పెళ్లిపై అనేక రూమర్స్ కూడా వార్తలలో నిలిచాయి.
నాగచైతన్య, శొభిత ధూళిపాళల పెళ్లి కోసం ఇప్పటికే ఇరు కుటుంబాలు సైతం భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారంట. అంతే కాకుండా.. ఇప్పటికే వెడ్దింగ్ కార్డు కూడా వార్తలలో నిలిచింది. దానిలో శోభితా అసలు పేరు.. లక్ష్మీ శొభితగా కూడా ఉంది. దీంతో అక్కినేని అభిమానులు తొలుత షాక్ కు గురైన మళ్లీ ఫుల్ ఖుషీ అయ్యారంట.
కొన్నిరోజుల క్రితమే శోభిత ధూళిపాళ ఇంట పసుపు దంచుడు కార్యక్రమం కూడా ఎంతో వేడుకగా జరిగింది. అయితే.. తాజాగా, శోభిత అక్కినేని కుటుంబానికి భారీగా కట్న కానుకల్ని తీసుకొని వెళ్తుందని కూడా రూమర్స్ వార్తలలో ఉంటున్నాయి.
ఈ నేపథ్యంలో అవన్ని పుకార్లు అని కొందరు అంటున్నారు.అయితే.. తాజాగా, అక్కినేని నాగార్జునకు కాబోయే కోడలు.. చేసిన ఫోటో షూట్ రచ్చగా మారింది. శోభితా తాజాగా, లవ్ బర్డ్స్ స్టూడియో కోసం హాట్ గా ఫోటో షూట్ దిగారు.
మెయిన్ గా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మోడ్రన్ డ్రెస్ లో ఫోటో షూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాలో శోభితా పోస్ట్ చేసింది. దీంతో ఇవి కాస్త సెకన్లలో వైరల్ గా మారిపోయాయి. దీనిపై నెటిజన్లు , అక్కినేని అభిమానులు మండిపడుతున్నారంట.
పెళ్లికి కొన్ని రోజుల ముందు ఇలాంటి పనులు అవసరమా.. అంటూ తిట్టిపోస్తున్నారంట. ఇలాంటి పనులు చేసి ఎందుకు ట్రోల్స్ కు గురౌతావని కొందరు కామెంట్లు సైతం చేస్తున్నారంట. మొత్తానికి శోభిత ఫోటోషూట్ వల్ల మళ్లీ వివాదాస్పదంగా మారి వార్తలలొ నిలిచింది.