Naga Chaitanya -Sobhita: క్యాన్సిల్ అయిన చైతన్య - శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్.. ట్విస్ట్ ఇదే..!

Mon, 04 Nov 2024-2:31 pm,

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ప్రేమించి త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు.  గడిచిన కొద్దిరోజుల క్రితం వీరి ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గానే జరిగిపోయింది. గతంలో సమంతని ప్రేమించి వివాహం చేసుకున్న నాగచైతన్య కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. 

అలా విడిపోయిన తర్వాత నాగచైతన్య.. శోభిత ధూళిపాళ తో కొద్దిరోజులు డేటింగ్ చేసి ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇటీవలే నాగచైతన్య ,శోభిత పెళ్లి పనులు జరుగుతున్నట్లుగా పలు రకాల ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిసెంబర్ మొదటి వారంలోనే వీరి వివాహం కాబోతున్నట్లు సమాచారం. 

తాజాగా శోభిత - నాగచైతన్యకు సంబంధించి.. వీరి వివాహం ఎక్కడ జరగబోతోంది.. ఆ ప్లేస్ నే ఎందుకు ఎంచుకున్నారు?  అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు నాగచైతన్య తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డులను కూడా తన స్నేహితులకు పంచుతూ ఉన్నట్లు సమాచారం. ఇక  వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

దీంతో అందరూ కూడా దుబాయ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరుగుతుందని అందరూ అనుకుంటూ ఉంటారు.  కానీ అక్కినేని హీరో మాత్రం అందరికీ షాక్ ఇస్తూ అన్నిటినీ క్యాన్సిల్ చేసుకుని మరీ అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి అందుకు సంబంధించి స్పెషల్ గా డెకరేషన్ చేయించి మరీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేయిస్తున్నట్లుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.

మొత్తానికైతే నాగచైతన్య శోభిత డెస్టినేషన్ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యి అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతోందని సమాచారం. నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సాయి పల్లవి తో జంటగా తండేల్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం వచ్చే యేడాది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే సంక్రాంతి బరిలో దిగాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link