Nagapanchami 2024: ఏడాదిలో ఒక్కరోజే.. నాగ పంచమి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే?

Tue, 06 Aug 2024-6:11 pm,

మనదేశంలో అనేక ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తుంటాం. అదే విధంగా మూగజీవాలను సైతం దేవుళ్ల మాదిరిగా కొలుస్తుంటారు. ప్రస్తుతం శ్రావణ మాసం నేపథ్యంలో.. నాగ పంచమి పండుగను అందరు జరుపుకుంటారు. ఈ సారి ఆగస్టు 9 న పంచమి నాడు నాగపంచమి పండుగను జరుపుకుంటాం. 

చాలా ప్రాంతాలలో మహిళలు ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకుని దగ్గరలో ఆలయాలకు వెళ్తుంటారు. మరికొందరు పుట్టలో పాలను పొస్తారు. రోజంతా ఉపవాసం ఉంటారు. జంటనాగులకు అభిషేకం చేస్తుంటారు.  

మన దేశంలో అనాదీనాగా నాగుల చవితి రోజున సోదరుల కళ్లను కళ్లను పాలతో కడుగుతుంటారు. అంతే నాగదేవతకు అభిషేకం చేసిన పాలతో.. అక్కలు లేదా చెల్లెళ్లు.. అన్న, తమ్ముళ్ల కళ్లకు పెడుుతుంటారు. ఆతర్వాత మంచి నీటితో  శుభ్రంచేస్తారు. దీని వల్ల దోషాలన్ని పోతాయని నమ్ముతుంటారు.

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఫెమస్ దేవాలయం ఉంది. ఇది కేవలం నాగుల పంచమిరోజున మాత్రమే తెరుచుకుటుంది. ఇక్కడ స్వామివారిని దర్శనంచేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి భారీగా వస్తుంటారు. ఈ ఆలయం రెండంతస్థులతో నిర్మించబడి ఉంది. 

ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో శ్రీ నాగ చంద్రేశ్వర ఆలయం ఉంటుంది.  ఇక్కడ శుక్లచతుర్థి తిథినాడు రాత్రి.. 12 గంటల నుంచి పంచమి రోజున అర్దరాత్రి 12 గంటల వరకు మాత్రం తెరిచి ఉంచుతారు. 

ఇక్కడ శేషతల్పం మీద విష్ణూమూర్తి కాకుండా.. శివపార్వతులు ఉంటారు. ఇక్కడ శ్రీ నాగ చంద్రశ్వేరుడు, శివపార్వతులు, నందివిగ్రహాలు, కూడా ఉన్నాయి. శివయ్య తన కుటుంబంతో పాటు.. శేష నాగుపై కూర్చున్న ఏకైక ఆలయంగా ఇదే అని చెప్పవచ్చు. 

ఈ ఆలయంను.. మాల్వా రాజ్యానికి చెందిన పర్మార్ రాజు భోజ్ .. 1050 AD లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సిందియాకు చెందిన మహారాజ్ రాణోజీ సింధియా దీన్ని 1732 లో పునరుద్ధరించారంట. శ్రీ నాగ చంద్రశ్వేర భగవాన్ విగ్రహాన్ని నేపాల్ నుంచి తీసుకొచ్చారని చెబుతుంటారు.

సాధారణంగా శివయ్య మెడ, భుజాల మీదు పాము చుట్టుకుని ఉంటుంది. కానీ ఒక్క ఉజ్జయినిలో మాత్రం శేషనాగుపై శివపార్వతుల విగ్రహం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆలయం లేదని భక్తులు భారీగా తరలివస్తుంటారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link