Ashika Ranganath: చీరలో వయ్యారాలు పోతూ కనువిందు చేస్తున్న నాగార్జున హీరోయిన్..

Mon, 07 Oct 2024-11:15 am,

కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన కన్నడ భామ ఆషికా రంగనాథ్. మొదటి సినిమా ఈ హీరోయిన్ కి అనుకొన్నంత విజయం మాత్రం సాధించ పెట్టలేదు. 

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కళ్యాణ్ రామ్ సినిమా పెద్దగా ఆడకపోయినా.. ఈ సినిమాలోని ఎన్నో రాత్రులు వస్తాయని పాటకి మాత్రం మంచి స్పందన వచ్చింది. ఇక ఈ పాట తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఈ హీరోయిన్.

కాగా ఆషికా తన రెండో సినిమాకి కింగ్ నాగార్జునతో ఛాన్స్ కొట్టేసింది. నాగార్జున సినిమాలో హీరోయిన్స్ కి మంచి పాత్రలు లభిస్తాయి. ఇక అదే విధంగా ఈ హీరోయిన్ కి కూడా నాగార్జున నా సామిరంగా సినిమాలో.. వరాలు అని మంచి వెయిటేజ్ ఉన్న పాత్ర లభించింది.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకున్న ఈ చిత్రంలో ఆషికా క్యారెక్టర్ మాత్రం అందరిని తెగ ఆకట్టుకుంది. ఇక దీంతో ఈ హీరోయిన్ కి వరస అవకాశాలు రావడం ఖాయం అనుకున్నారు అందరూ. 

అయితే ఈ కర్ణాటక అమ్మాయికి.. నాగార్జున సినిమా తరువాత తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రావడం లేదు. కన్నడ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆషికా.. తెలుగులో మాత్రం వెనుకబడే ఉంది.

సినిమాలపరంగా తెలుగు ప్రేక్షకులను పలకరించ లేకపోయినా.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అన్ని భాషల ప్రేక్షకులను తెగ అలరిస్తోంది ఈ హీరోయిన్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link