Naraka chathurdashi 2024: నరక చతుర్దశి ఎప్పుడు? ఆకస్మిక మరణాల సంభవించకుండా యమ దీపం ఏ సమయంలో వెలిగించాలి?

Fri, 25 Oct 2024-2:25 pm,

దీపావళికి ముందు వచ్చే రోజున చతుర్దశి రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ ఏడాది 2024 అక్టోబర్‌ 30 బుధవారం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 31 గురువారం మధ్యాహ్నం 2:49 నిమిషాల వరకు ఉంటుంది.  

అయితే, అక్టోబర్‌ 31వ తేదీనే నరక చతుర్దశి జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం లేవగానే తైల అభ్యంగన స్నానం చేయాలి.  

ఈరోజు సాయంత్రం సమయంలో ఉల్కా ప్రదర్శనం కూడా చేస్తారు. పెత్తర అమావాస్య సమయంలో భూలోకానికి వచ్చిన పెద్దలు ఈ అమావాస్య ముందు వారు పితృలోకానికి ప్రయాణిస్తారు.అందుకే ఆకాశంపై పు చూస్తూ దీపం చూపిస్తే వారి మార్గానికి సుగమం అవుతుంది అని నమ్ముతారు. ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తారు.  

నరక చతుర్దశి రోజు యమదీపం వెలిగిస్తారు. ఈదీపం వల్ల ఇంట్లో ఆకస్మిక మరణాలు సంభవించకుండా ఉంటాయి. మెయిన్‌ డోర్‌ బయటవైపు గడప వద్ద రెండు దివ్వెలు తీసుకుని పసుపు కుంకుమ పూలు పెట్టి దీపం వెలిగించాలి. దీన్ని దక్షిణం వైపు పెట్టుకోవాలి.

రెండు చొప్పున ఆరు వత్తులు మూడు దిక్కుల పెట్టి వెలిగించాలి. బెల్ల నైవేద్యంగా పెట్టాలి. ఈ దీపాన్ని కొంతమంది ఐదురోజులు, కార్తీక మాసంలో ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తారు. అప్పుడు ఈ దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు.  

భాద్రపద మాసంలో మన పితృదేవతలు భూలోకం చేరుకుని తిరిగి ఈ రోజుల్లో తిరిగి పితృలోకానికి వెళ్తారు.అందుకే వారి కోసం వెలిగిస్తారు. అక్టోబర్‌ 30వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాల నుంచి రాత్రి 7:20 వరకు యమదీపం వెలిగించడానికి సరైన సమయం.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link