National Tourism Day: దేశంలోని టాప్ 5 అందమైన, అద్భుతమైన ద్వీపాలివే
సెయింట్ మేరీస్ ఐల్యాండ్స్, కర్ణాటక
సెయింట్ మేరీస్ ఐల్యాండ్ వాస్తవానికి 4 చిన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది కర్ణాటక ఉడుపి సమీపంలో అరేబియా సముద్రంలో ఉంది. ఇక్కడి రాక్ ఫార్మేషన్, క్లియర్ బ్లూ వాటర్ పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ ద్వీపం చూడ్డానికే తప్ప అక్కడంతా నిర్మాణుష్యంగా ఉంటుంది.
రామేశ్వరం, తమిళనాడు
తమిళనాడులో ఉన్న రామేశ్వరం ద్వీపాన్ని పంబన్ ద్వీపమని కూడా అంటారు. రామనాథ్ స్వామి మందిరం, ధనుష్కోడి, పంబన్ బ్రిడ్జ్, పంచముఖి హనుమాన్ మందిరం, కలామ్ హౌస్, కలామ్ మెమోరియల్, విలుండి తీర్ధమ్ వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలున్నాయి.
మాజులీ ఐల్యాండ్స్, అస్సోం
మాజులీ అనేది అస్సోంలోని అతిపెద్ద రివర్ ఐల్యాండ్. జోర్హాట్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంది. ఇక్కడి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఆకర్షితులౌతుంటారు.
డియో ఐలాండ్స్, గుజరాత్
డియో ఐలాండ్స్ ఒకప్పుడు పోర్చుగల్ ఆధీనంలో ఉండేది. అందుకే డియో ఐలాండ్స్‌లో పోర్చుగల్ సంస్కృతీ స్పష్టంగా కన్పిస్తుంది. ఇక్కడి శాండీ బీచెస్, 16వ శతాబ్దపు కోట, గుహలు అద్భుతమైన అనుభవాన్నిస్తాయి.
అండమాన్ నికోబార్ దీవులు
అండమాన్ నికోబార్ దీవులు దేశంలోనే అతిపెద్ద ద్వీప సమూదాయం. హనీమూన్, ఇతర వెకేషన్లకు అద్భుతమైన డెస్టినేషన్. బ్లూ వాటర్ బీచెస్, కోరల్స్ దీవులు చాలా అందంగా కన్పిస్తున్నాయి. అండమాన్ ముఖ్య పట్టణమైన పోర్ట్ బ్లెయిర్‌కు ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది.