Nani: ఇద్దరు స్టార్ హీరోలతో నాని గొడవ.. అసలు ఏమైందంటే..!

వరస విజయాలతో.. టైప్ 2 హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నారు నాని. దసరా, హాయ్ నాన్న సినిమాలతో మంచి విజయాలు సాధించిన ఈ హీరో.. త్వరలోనే హిట్ 3 సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానన్నారు. హిట్ సిరీస్ కి నాని నిర్మాణ బాధ్యతలు వహించిన సంగతి తెలిసిందే. హిట్ మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా చేయగా.. రెండవ భాగంలో ఆడివి శేషు హీరోగా కనిపించారు. కాగా రెండో భాగం క్లైమాక్స్ లోనే.. మూడో భాగం లో నాని హీరోగా చేయనున్నారు అని తెలియజేశారు.

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన.. పోస్టర్లు సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాని వేసవికాలం సెలవల్లో విడుదల చేయడానికి.. ప్లాన్ చేశాడు చిత్ర యూనిట్. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మే ఒకటిన విడుదల చేస్తాము అని ఈ మధ్యనే తెలియజేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమాకి.. సమస్యలు తప్పేలా లేవు.

ఇందుకు ముఖ్య కారణం ఇప్పుడు ఇదే తారీఖున రజనీకాంత్.. కూలి చిత్రం కూడా విడుదల చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేయడం. నాని ఎన్నో రోజుల నుంచి పాన్ ఇండియా హీరోగా మంచి పేరు..తెచ్చుకోవాలని తెగ ట్రై చేస్తున్నారు. దసరా, హాయి నాన్న సినిమాలు తెలుగులో విజయాల సాధించిన.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు హిట్ 3 సినిమాతో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేశాడు.
కానీ ఇప్పుడు ఇదే డేట్ రజనీకాంత్ చిత్రం లాక్ చేసుకోవడంతో.. మళ్లీ నానికి పాన్ ఇండియా వైడ్ తన హిట్ 3 సినిమాకి థియేటర్లు దొరకడం కష్టంగా కనిపిస్తోంది. కూలి సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇటు రజినీకాంత్ అభిమానులు అటు నాగార్జున అభిమానులు ఈ చిత్రం కోసం తెగ ఎదురుచూస్తూ ఉంటారు. మరి నాని తన సినిమాకి ఎక్కువ థియేటర్స్ తెచ్చుకోవాలన్నా.. మంచి కలెక్షన్స్ రాబట్టాలన్న.. ఈ ఇద్దరు హీరోలతో పోటీ పడాల్సి ఉంటది.
సినిమా కథ చాలా బాగుంటే తప్ప.. లేదా కూలీ సినిమా పెద్దగా లేకపోతే తప్ప.. హిట్ 3 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో కూలీ చిత్రాన్ని దాటే అవకాశాలు లేవు. మరి ఇవన్నీ అధిగమించి.. తాను నమ్ముకున్న కథతో నాని ఈసారి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.