Nayanthara: ప్రభుదేవాకి అందుకే బ్రేకప్ చెప్పిన నయనతార.. కారణమేమిటంటే..!

Mon, 19 Aug 2024-10:52 pm,

తెలుగు తమిళ్ కన్నడ అంటూ భాషా బేధం లేకుండా సౌత్ ఇండియా మొత్తం మీద వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ నయనతార. అభిమానులు ఈమె ను ముద్దుగా సౌత్ లేడీ సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఆయన నయనతార వ్యక్తిగత జీవితం కారణంగా కూడా కొన్నిసార్లు వార్తలు తెలుస్తూ ఉంటారు. 

చాలామంది స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ ఇద్దరు కవల పిల్లలు కూడా పుట్టారు. నయనతార ప్రభుదేవా తో ప్రేమలో ఉండేవాళ్లు. కానీ మనస్పర్ధల కారణంగా బ్రేకప్ చేస్తున్నారు.

అసలు నయనతార ప్రభుదేవా మధ్య బ్రేక్ అప్ ఎందుకు జరిగింది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నయనతార కోసం తన భార్యకు విడాకులు సైతం ఇచ్చిన ప్రభుదేవానే వీరి బ్రేకప్ కి కారణం అని తెలుస్తోంది. ప్రేమలో ఉన్నప్పుడు నయనతార కి ప్రభుదేవా చాలా కండిషన్ లు పెట్టేవారట. అందుకే బ్రేకప్ అయ్యింది అని సమాచారం.   

 నయనతార ఒక క్రిస్టియన్ కావడంతో పెళ్లి తర్వాత ఆమె మతం మార్చుకోవాలి అని.. పెళ్లి తర్వాత సినిమాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలి.. పెళ్లి తర్వాత తన మొదటి భార్య పిల్లలు కూడా తమతోపాటే ఉంటారు.. ఇలా చాలానే కండిషన్లు పెట్టారట.   

చాలా కండిషన్లకి ఒప్పుకున్నా నయనతార మొదటి భార్య పిల్లలు తమతో ఉంటారు అని దాన్ని మాత్రం ఒప్పుకోలేదట. అందుకే వీళ్ళిద్దరికీ బ్రేకప్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link