Nayanthara: బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న నయనతార.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండే హీరోయిన్స్ లో.. నయనతార ఒకరు. అసలు నయనతారకు ఈ మధ్య వరకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదు. కాగా షారుఖ్ ఖాన్ జవాన్ లో నటించిన నయనతార.. తన బాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంస్టాగ్రామ్ వాడటం మొదలుపెట్టింది.
ఇక అప్పటినుంచి.. ఆ వాడకాన్ని అలానే కంటిన్యూ చేసింది. ముఖ్యంగా నయనతార.. తన భర్త విగ్నేష్ శివన్ తో.. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది.
ఈమధ్య కూడా తన టూర్ ఫోటోలు షేర్ చేసి.. అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మాత్రం నయనతార.. తన సోలో ఫోటోలు షేర్ చేసి.. అభిమానులను మరింత ఫిదా చేసింది. ఈ ఫోటోలలో నయనతార ఎంతో అందంగా కనిపిస్తూ.. అందరినీ ప్రేమలో పడేస్తోంది..
కాగా త్వరలో నయనతార.. ది టెస్ట్ అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాలో నయనతార తో పాటు.. సిద్ధార్థ్, మాధవన్, మీరాజాస్మిన్ కూడా నటిస్తున్నారు.
అంతేకాకుండా.. డియర్ స్టూడెంట్స్ అనే మలయాళం సినిమాలో కూడా త్వరలో కనిపించనుంది ఈ హీరోయిన్. ఈ ప్రాజెక్టు పైన మలయాళీ అభిమానులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరోపక్క నయనతార.. ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకైతే సైన్ చేయలేదు. అయితే మంచి విష్ణు హీరోగా చేసిన కన్నప్ప.. సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించనుంది అని వినికిడి